కాపుల రిజర్వేషన్లపై కేంద్రం తీర్మానం చేయాలా?
ABN , First Publish Date - 2022-12-29T03:42:47+05:30 IST
ముస్లిం రిజర్వేషన్లకు కేంద్ర ప్రభుత్వ తీర్మానం అవసరం లేదు. కేవలం కాపులకు మాత్రం కేంద్రం తీర్మానం చేయాలా.
పేర్ని వ్యాఖ్యలపై సోము ఫైర్
రాజమహేంద్రవరం అర్బన్, డిసెంబరు 28: ‘ముస్లిం రిజర్వేషన్లకు కేంద్ర ప్రభుత్వ తీర్మానం అవసరం లేదు. కేవలం కాపులకు మాత్రం కేంద్రం తీర్మానం చేయాలా..’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. రాజమహేంద్రవరంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘కాపులకు రిజర్వేషన్లపై పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు అర్థరహితం. బీసీలకు కేటాయించిన రాజకీయ రిజర్వేషన్లలో ముస్లింలకు టికెట్లు ఇవ్వడం వల్ల బీసీలు ప్రజాప్రతినిధులయ్యే అవకాశాలు కోల్పోతున్నారు. కాపులకు అన్యాయం చేసింది కుటుంబ పార్టీలే’’ అని సోము విమర్శించారు.