Sabarimala: తక్కువ ఖర్చులో శబరిమలకు వెళ్లొచ్చే ఆలోచనలో ఉన్న భక్తుల కోసం ఈ వార్త..

ABN , First Publish Date - 2022-11-27T21:11:09+05:30 IST

శబరిమల యాత్రికుల కోసం డిసెంబర్‌, జనవరి నెలల్లో మరి కొన్ని ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు..

Sabarimala: తక్కువ ఖర్చులో శబరిమలకు వెళ్లొచ్చే ఆలోచనలో ఉన్న భక్తుల కోసం ఈ వార్త..

సికింద్రాబాద్‌ (ఆంధ్రజ్యోతి): శబరిమల యాత్రికుల కోసం డిసెంబర్‌, జనవరి నెలల్లో మరి కొన్ని ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు.

* హైదరాబాద్‌-కొల్లం స్పెషల్‌ (నెంబర్‌: 07133) హైదరాబాద్‌ నుంచి డిసెంబర్‌ 5, 12, 19, 26, జనవరి 2, 9, 16వ తేదీల్లో (సోమవారం) బయల్దేరుతుంది.

* కొల్లం-హైదరాబాద్‌ స్పెషల్‌ (నెంబర్‌: 07134) కొల్లం నుంచి డిసెంబర్‌ 6, 13, 20, 27, జనవరి 3, 10, 17వ తేదీల్లో (మంగళవారం) బయల్దేరుతుంది.

* నర్సాపూర్‌-కొట్టాయం స్పెషల్‌ (నెంబర్‌: 07119) నర్సాపూర్‌ నుంచి డిసెంబర్‌ 2, 9, 16, 30, జనవరి 6, 13వ తేదీల్లో (శుక్రవారం) బయల్దేరుతుంది.

* కొట్టాయం-నర్సాపూర్‌ స్పెషల్‌ (నెంబర్‌: 07120) కొట్టాయం నుంచి డిసెంబర్‌ 3, 10, 17, 31, జనవరి 7, 14వ తేదీల్లో (శనివారం) బయల్దేరుతుంది.

* సికింద్రాబాద్‌-కొట్టాయం స్పెషల్‌ (నెంబర్‌: 07125) సికింద్రాబాద్‌ నుంచి డిసెంబర్‌ 4, 11, 18, 25, జనవరి 1, 8వ తేదీల్లో (ఆదివారం) బయల్దేరుతుంది.

* కొట్టాయం-సికింద్రాబాద్‌ స్పెషల్‌ (నెంబర్‌: 07126) కొట్టాయం నుంచి డిసెంబర్‌ 5, 12, 19, 26, జనవరి 2, 9వ తేదీల్లో (సోమవారం) బయల్దేరుతుంది.

కొన్ని మార్గాల్లో ప్రత్యేక రైళ్ల పొడిగింపు

కొన్ని మార్గాల్లో ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లను మరి కొద్ది రోజుల పాటు పొడిగిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

* తిరుపతి-సికింద్రాబాద్‌ స్పెషల్‌ (నెంబర్‌: 07481) రైలు డిసెంబర్‌ 4 నుంచి జనవరి 29వ తేదీ (ఆదివారం) నడుస్తుంది.

* సికింద్రాబాద్‌-తిరుపతి స్పెషల్‌ (నెంబర్‌: 07482) రైలు డిసెంబర్‌ 5 నుంచి జనవరి 30వ తేదీ వరకు (సోమవారం) నడుస్తుంది.

* హైదరాబాద్‌-తిరుపతి స్పెషల్‌ (నెంబర్‌: 07643) రైలు డిసెంబర్‌ 5 నుంచి జనవరి 26వ తేదీ వరకు (సోమవారం) నడుస్తుంది.

* తిరుపతి- హైదరాబాద్‌ స్పెషల్‌ (నెంబర్‌: 07644) రైలు డిసెంబర్‌ 6 నుంచి జనవరి 27వ తేదీ వరకు (మంగళవారం) నడుస్తుంది.

Updated Date - 2022-11-27T21:16:17+05:30 IST