Home » Sabarimala
మకర సంక్రమణ సమయంలో.. కాంతమలైగా పిలిచే పొన్నంబలమేడుపై జ్యోతి రూపంలో దర్శనమిచ్చే హరిహర పుత్రుడు అయ్యప్పస్వామి దర్శనానికి భక్తులు శబరికొండకు తరలివస్తున్నారు.
శబరిమలలో మకర జ్యోతి దర్శనం కోసం అయ్యప్ప భక్తులు ఎంతో భక్తిగా వేచి చూస్తుంటారు. ప్రతి సంక్రాంతి పండుగ రోజు దర్శనమిచ్చే మకర జ్యోతిని దర్శించుకునేందుకు లక్షలాది భక్తులు అయ్యప్ప కొండకు చేరుకుంటారు. ఈ నెల 14న సంక్రాంతి సందర్భంగా మకర జ్యోతి దర్శనం ఉంటుంది.
సంక్రాంతి రోజున మకరజ్యోతిని దర్శించుకునేందుకు కొండకు పోటెత్తుతారు. ఈ నేపథ్యంలో శబరిమల పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది. అయ్యప్ప దర్శనానికి వచ్చిన కొందరు భక్తులు ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు.
మాదన్నపేట ఉప్పరిగూడకు చెందిన అయ్యప్ప స్వాములు ప్రయాణిస్తున్న బస్సు కేరళలోని శబరిమల సమీపంలో ఘాట్ రోడ్డులో బోల్తా పడింది.
ఎరుమేళి నుంచి అటవీ మార్గంలో అలుదానది, కరిమల కొండ మీదుగా(పెద్దపాదం) శబరిమలకు వచ్చే భక్తులకు ఇస్తున్న స్పెషల్ పాస్‌లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు(టీడీబీ) ప్రకటించింది.
వచ్చే నెల 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు శబరిమల ప్రత్యేక రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
శబరిమలలో మండల పూజోత్సవానికి సర్వం సిద్ధమైంది. గురువారం మధ్యాహ్నం నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరగనున్నందున వర్చువల్ బుకింగ్‌లో 50 వేల మంది.. స్పాట్ బుకింగ్‌లో 5 వేల మంది భక్తులకు మాత్రమే దర్శనానికి అవకాశం కల్పిస్తామని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు(టీడీబీ) వెల్లడించింది.
అటవీ మార్గంలో శబరిమల అయ్యప్ప దర్శనానికి కాలినడకన వెళ్లే భక్తులకు ప్రత్యేక దర్శన సౌకర్యం కల్పించనున్నారు.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధానస్టేషన్‌ల నుంచి శబరిమలకు అదనంగా 26 ప్రత్యేక రైళ్ళను నడుపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అఽధికారులు ప్రకటించారు.
అయ్యప్పస్వామి భక్తుల రద్దీ మేరకు వచ్చే జనవరి, ఫిబ్రవరిలో శబరిమలకు వెళ్లి రావడానికి వేర్వేరు స్టేషన్ల నుంచి 34 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.