JD Laxmi Narayana: వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను సంపన్నుల చేతుల్లో పెట్టేందుకే..
ABN , First Publish Date - 2022-11-20T16:20:37+05:30 IST
Vizag: దేశ సంపదను కేంద్ర ప్రభుత్వం క్రమేణా సంపన్నుల చేతుల్లో పెట్టేలని చూస్తోందని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ ఆరోపించారు.
Vizag: దేశ సంపదను కేంద్ర ప్రభుత్వం క్రమేణా సంపన్నుల చేతుల్లో పెట్టేలని చూస్తోందని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ ఆరోపించారు. ‘విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు’ పేరుతో రైటర్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన సదస్సుకు ఆయనతో పాటు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, సినీ నటుడు ఆర్. నారాయణమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించకుండా ఎన్ఎండీసీ, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో మిళితం చేయాలని, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరున్న ఉన్న భూములను స్టీల్ ప్లాంట్‌కు ఇచ్చేయాలని డిమాండ్ చేశారు.