Narayana swamy: కృష్ణానదిపై ఇన్నర్‌రోడ్డు బ్రిడ్జ్‌ను సందర్శించిన కేంద్రమంత్రి

ABN , First Publish Date - 2022-09-14T16:56:40+05:30 IST

జిల్లాలోని గొల్లపూడి వద్ద కృష్ణా నదిపై ఇన్నర్ రోడ్డు బ్రిడ్జ్‌ను కేంద్రమంత్రి నారాయణస్వామి బుధవారం ఉదయం సందర్శించారు.

Narayana swamy: కృష్ణానదిపై ఇన్నర్‌రోడ్డు బ్రిడ్జ్‌ను సందర్శించిన కేంద్రమంత్రి

ఎన్టీఆర్: జిల్లాలోని గొల్లపూడి వద్ద కృష్ణా నదిపై ఇన్నర్ రోడ్డు బ్రిడ్జ్‌ను కేంద్రమంత్రి నారాయణస్వామి 
(Narayana swamy) బుధవారం ఉదయం  సందర్శించారు. ప్రాజెక్టు నిర్మాణంలో పలు సమస్యలను గుర్తించినట్లు కేంద్రమంత్రి (Union minister) తెలిపారు. పొలాలు, ఇల్లు కోల్పోయిన వారు తమకు సర్వీస్ రోడ్డు కావాలని ఈ సందర్భంగా కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. అనంతరం కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రం నడిబొడ్డున ఉందనే అమరావతిని రాజధానిగా కొనసాగించి అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాని (AP Government)కి సూచించినట్లు తెలిపారు. అమరావతి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో నిధులు కేటాయించిందన్నారు. అమరావతి కేంద్రంగా మూడు జిల్లాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం (Central government) గతంలో సహకారం అందించిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకోకుండా, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో అభివృద్ధి మందగించిందని విమర్శించారు. మూడు రాజధానులు అంటూ రాష్ట్ర  ప్రజల మధ్య చిచ్చు పెట్టవద్దని... అభివృద్ధిపై దృష్టి సారించాలని హితవుపలికారు.  బ్రిడ్జి నిర్మాణంలో పొలాలు, ఇల్లు కోల్పోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చూపించాలని కేంద్రమంత్రి నారాయణ స్వామి తెలిపారు.

Updated Date - 2022-09-14T16:56:40+05:30 IST