రాష్ట్రంలో కక్ష సాధింపు పాలన : జయమంగళ

ABN , First Publish Date - 2022-11-11T01:07:42+05:30 IST

రాష్ట్రంలో కక్ష సాధింపు పాలనతో ప్రతిపక్షాలు, ప్రజలు నిత్యం ఆందోళనకు గురవుతున్నారని టీడీపీ నియోజక వర్గ ఇన్‌చార్జి జయమంగళ వెంకటర మణ విమర్శించారు.

రాష్ట్రంలో కక్ష సాధింపు పాలన : జయమంగళ

ముదినేపల్లి రూరల్‌, నవంబరు 10 : రాష్ట్రంలో కక్ష సాధింపు పాలనతో ప్రతిపక్షాలు, ప్రజలు నిత్యం ఆందోళనకు గురవుతున్నారని టీడీపీ నియోజక వర్గ ఇన్‌చార్జి జయమంగళ వెంకటర మణ విమర్శించారు. గురువారం దేవపూడి గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా పార్టీ నాయకు లు, కార్యకర్తలతో కలసి బైక్‌ ర్యాలీగా ఇంటింటికి తిరిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అస్తవ్యస్థ విధానాలతో పాలిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యావసర సరుకులు, బియ్యం, నూనెలు, విద్యుత్‌ చార్జీలు, పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను విపరీ తంగా పెంచి ప్రజలపై మోయలేని భారాన్ని వేశాడని వివరించారు. ప్రతీ ఒక్క రూ గత చంద్రబాబు ప్రభుత్వంతో జగన్‌ ప్రభుత్వాన్ని బేరీజు వేసుకోవా లని సూచించారు. దావు నాగరాజు, పోసిన పాండురంగారావు, బొంగు రవి, కొండ, మహేంద్ర, యర్రా రాంబాబు, ఆలపాటి కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-11T01:07:45+05:30 IST