అమ్మఒడి లబ్ధిదారులను తగ్గించే ప్రయత్నం

ABN , First Publish Date - 2022-04-16T09:10:45+05:30 IST

అమ్మఒడి లబ్ధిదారులను తగ్గించే ప్రయత్నం

అమ్మఒడి లబ్ధిదారులను తగ్గించే ప్రయత్నం

300 యూనిట్ల విద్యుత్‌కు, అమ్మఒడికి సంబంధం ఏమిటి: రఘురామరాజు


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): అమ్మఒడి పథకం లబ్ధిదారుల్లో 20ు మందిని తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైసీపీ ఎంపీ రఘురామరాజు ఆరోపించారు. అసలు అమ్మఒడి.. దొంగ పథకమని విమర్శించారు. ఢిల్లీలో శుక్రవారం మాట్లాడారు. 300 యూనిట్ల విద్యుత్తు వినియోగానికి, అమ్మఒడి పథకానికి సంబంధం ఏమిటని ప్రశ్నించా రు. దీన్ని దివాళాకోరు రాజకీయం అంటారని విమర్శించారు. బోగస్‌ పథకాలతో ప్రభుత్వం కాలం వెళ్లదీస్తోందన్నారు. రేష న్‌ బియ్యానికి బదులుగా నగదు బదిలీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని రఘురామ తప్పుబట్టారు. పేద ప్రజల ఆకలి విలువ సీఎం జగన్‌కు తెలియదన్నారు. అలాగే, రాష్ట్రంలో ఆధార్‌ కేంద్రాల సంఖ్య పెంచకుండా ఆధార్‌ కార్డుల్లో కొత్త జిల్లాల వారీగా చిరునామాలు మార్చుకోవాలని ప్రభుత్వం కోరడం అర్థంలేని చర్యన్నారు. చిరునామాల మార్పు పేరుతో పథకాలను ఎగ్గొట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కాశ్మీర్‌ ఫైల్స్‌ లాగా కాకాణి గోవర్థన్‌ రెడ్డి కేసు ఫైల్స్‌ను కోర్టు నుంచి దొగిలించినట్లుగా వార్తలు వస్తున్నాయని, కోర్టు నుంచి తొలిసారిగా ఫైల్స్‌ దొంగతనం జరిగాయని అన్నారు. మరోవైపు, దొంగ పోలీసును తీసుకొచ్చి తనను హత్య చేసి ఇతరుల ఖాతాలో వేయాలని చూశారని, ఈ మేరకు హైదరాబాద్‌లోని తన ఇంటిపై కూడా రెక్కీ జరిగిందని తెలిపారు.  

Updated Date - 2022-04-16T09:10:45+05:30 IST