ఇక్కడే తేల్చుకుంటా
ABN , First Publish Date - 2022-10-18T08:55:26+05:30 IST
‘‘ప్రతి విషయాన్ని బీజేపీ పెద్దల వద్దకు తీసుకెళ్లి, చాడీలు చెప్పి సహాయం అడిగే వ్యక్తిని కాను. ఇక్కడే పోరాటం చేస్తాను. ఇక్కడే తేల్చుకుంటాను’’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు. సోమవారం విశాఖ నుంచి మంగళగిరిలోని పార్టీ ప్రధాన
క్రిమినల్స్ పాలించకూడదు
వైసీపీ ముక్త ఏపీ జనసేన లక్ష్యం: పవన్ కల్యాణ్
దాని కోసం నా వంతు ప్రయత్నం చేస్తా
ప్రభుత్వ తప్పులను ఎండగడదాం
సర్కారే శాంతిభద్రతల సమస్య సృష్టిస్తోంది
వైసీపీ తాటాకు చప్పుళ్లకు భయపడం
జైల్లో మా వాళ్లని బెల్ట్‌తో కొట్టారు
విశాఖలో సంబంధం లేని వ్యక్తులపై కేసులు: పవన్ కల్యాణ్
అమరావతి, విశాఖపట్నం, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): ‘‘ప్రతి విషయాన్ని బీజేపీ పెద్దల వద్దకు తీసుకెళ్లి, చాడీలు చెప్పి సహాయం అడిగే వ్యక్తిని కాను. ఇక్కడే పోరాటం చేస్తాను. ఇక్కడే తేల్చుకుంటాను’’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు. సోమవారం విశాఖ నుంచి మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకుని మీడియాతో మాట్లాడారు. ‘సంఘ విద్రోహ శక్తులు శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తే దాని ని బలంగా ఎదుర్కోవాలి కానీ, రాష్ట్రంలో ప్రభుత్వమే శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తోంది. కొంత మంది ఉత్తరాంధ్ర నాయకుల అవినీతి బాగోతం ఎక్కడ బయ ట పడుతుందోననే భయంతో జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకున్నారు’ అని ధ్వజమెత్తారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ జరిగినప్పుడే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. ఆ దిశగా జనసేన అడుగులు వేస్తుందన్నారు. ప్రజలను చైతన్యం చేయడంలో మీడియా, జర్నలిస్టులు కూడా తమకు సహకరించాలని కోరారు. ‘‘విశాఖలో అధికార వైసీపీకి పోటీగా కార్యక్రమాలు నిర్వహించాలనే ఉద్దేశం మాకు లేదు.
వైసీపీ గర్జన కార్యక్రమాన్ని ప్రకటించకముందే మేం విశాఖ జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించాం. ఆ మేరకు ఏర్పాట్లు చేసుకున్నాం. అమరావతిపై ఎవరూ మాట్లాడకూడదు. మూడు రాజధానులపై నోరెత్తకూడదు అంటే ఎలా? జనసేన ఒక రాజకీయ పార్టీ. దానికి కొన్ని స్టాండ్స్ ఉన్నాయి. వైసీపీ లా అధికారంలోకి రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరొక మాట మాట్లాడటం చేతకాదు. వైసీపీ కోరుకుంటున్న హింసను మేం ఇవ్వలేం. వైసీపీ నాయకుల్లో ఎక్కువ శాతం మంది నోటికి అడ్డూఅదుపు ఉండదు. బూతులు తిడతారు. వైసీపీ నాయకుల తాటా కు చప్పుళ్లకు, ఉడత ఊపులకు భయపడేవాడు ఎవడూ లేడు. తమిళనాడు వాళ్లు తరిమేశారు.. తెలంగాణ నాయకులు వెళ్లగొట్టారు. అయినా మన రాజకీయ వ్యవస్థకు సిగ్గలేకపోతే ఎలా? కులాలు, మతాలు, ప్రాంతాల పేరు తో ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. మొన్నటికి మొన్న కోనసీమలో ఇదే ప్రయత్నం జరిగింది. వైసీపీ మనుషులే వాళ్ల మంత్రి ఇంటిని తగలబెట్టారు. మా వాళ్లు మీద తోసేయడానికి విశ్వప్రయత్నం చేశారు. దానిని తిప్పికొట్టాం. గర్జన ఫెయిల్ అవ్వడం, మన ర్యాలీ సక్సెస్ అవ్వడం ఓర్వలేక ఇలా డ్రామాలు ఆడుతున్నారు. మంత్రుల కాన్వాయ్ వెళ్తుంటే పోలీసులు బందోబస్తు ఎందుకు ఇవ్వలేదు? జనసైనికులను ఎందుకు కవ్వించారు? వాళ్ల ప్లాన్‌లో భాగంగానే ఇదంతా జరిగిం ది. రెచ్చగొడితే రెచ్చిపోతానని నన్ను కూడా ఒక ఐపీఎస్ అధికారి రెచ్చగొట్టాలని చూశారు. శాంతిభద్రతల సమ స్య వస్తే మూసేద్దాం అనుకున్నారు. రాష్ట్ర శ్రేయస్సు కోరుకునే వాడిని వైసీపీ కోరుకునే హింసను ఇవ్వలేం’’
మా నాయకులపై కేసులు..
’’విశాఖలో సంబంధంలేని వ్యక్తులపై కేసులు పెట్టా రు. వైసీపీ వాళ్లు రాళ్లు విసిరి అద్దాలు పగలగొడితే వాళ్ల ది భావ ప్రకటన స్వేచ్ఛ. మిగతా ఏ పార్టీలు నోరు విప్పి నా హత్యాయత్నం కేసులు పెడతారు. నేను విశాఖ వస్తున్నానని చెప్పి 14 మంది కమిటీగా ఏర్పడి కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. వాళ్లపై సెక్షన్ 307 కింద కేసులు పెట్టారు. మరో 105 మందిపై కేసులు పెట్టారు. రూప అనే జనసైనికురాలిని అక్రమంగా అరెస్టు చేశారు. రెండేళ్ల కూతురుతో ఇంట్లో ఉన్న ఆమెను బలవంతంగా లాక్కెళ్లి జైల్లో పెట్టారు. రాష్ట్ర పోలీస్ వ్యవస్థపై నమ్మకం లేదని చెప్పిన వ్యక్తి కోసం.. రాష్ట్రం మీద అపారమైన ప్రేమ ఉన్న మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా రు. మా పార్టీ నాయకులను రక్షించుకోవడానికి బలంగా నిలబడతాం’’ అని పవన్ సృష్టం చేశారు.
ఇక్కడే పోరాటం చేస్తా
హక్కుల భంగంపై కోర్టుకు..
’’నోరు జారే వైసీపీ నాయకులకు మంగళగిరి నుంచి ఒక్కటే చెబుతున్నాను. మిమ్మల్ని మేం బలంగా ఎదుర్కొంటాం. ఏం చేసుకుంటారో చేసుకోండి. మేం వెళ్లలేకపోయినా జనవాణికి 300 దరఖాస్తులు వచ్చాయి. అందులో మంత్రి ధర్మాన, ఎమ్మెల్యే ధర్మశ్రీ, విజయనగరం, అనకాపల్లికి చెందిన నాయకుల భూముల వ్యవహారాలపై ఫిర్యాదులు వచ్చాయి. న్యాయ వ్యవస్థపై జనసేనకు పూర్తి విశ్వాసం ఉంది. నినాదాలు చేసే వారిపై ఐపీసీ సెక్షన్ 307 ప్రకారం ఎందుకు కేసులు పెట్టారు? దానిని సెక్షన్ 326 కింద మార్చండని న్యాయవ్యవస్థ చెప్పింది. న్యాయ వ్యవస్థకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. వైసీపీ ప్రభుత్వం ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తోంది. మంత్రులకే హక్కులు ఉన్నట్లు, సామాన్యులకి హక్కులు లేనట్లు ప్రవర్తిస్తున్నా రు. దానిపై కూడా న్యాయవ్యవస్థ దృష్టి పెట్టాలని కోరుకుంటున్నా. నాకు పోలీసులంటే గౌరవం ఉంది. నేను ఆ కుటుంబం నుంచి వచ్చిన వాడినే. మేం పోలీసులతో యుద్ధం చేయడం లేదు. రాత్రి 12 నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకూ నోవాటెల్ హోటల్‌లో గందరగోళం సృష్టించారు. ఎంతో మంది విదేశీ పర్యాటకులు అక్కడ ఉన్నారు.
వారిని భయాందోళనకు గురిచేశారు. ఇలా అయితే పర్యాటక రంగం నాశనం కాదా? నా సిని మా విడుదలైనప్పుడే టికెట్ల రేట్లు తగ్గుతాయి! నా పర్యటన జరిగినప్పుడే శాంతి భద్రతల సమస్య వస్తుంది! నా పుట్టిన రోజు వచ్చినప్పుడే పర్యావరణంపై ప్రేమ పుట్టుకొస్తుంది’’ అని పవన్ ధ్వజమెత్తారు. కాగా, విశాఖలో వైసీపీకి లేని నిబంధనలు జనసేనకు ఎందుకని పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. ‘ఈ నెల 1 నుంచి పోలీస్ యాక్ట్-30 అమల్లో ఉన్న కారణంగా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించకూడదని, డ్రో న్లు ఎగరవేయకూడదని పోలీసులు చెబుతున్నారు. మరి 15వ తేదీ వైసీపీ నాయకులు గర్జన ఎలా చేశారు?’’ అని మనోహర్ నిలదీశారు. సోమవారం విశాఖ నుంచి విజయవాడకు బయలుదేరే ముందు పవన్ కల్యాణ్ వీడి యో రూపంలో ప్రజలకు ఒక సందేశాన్ని విడుదల చేశా రు. తనను చూసేందుకు అనేక ప్రాంతాల నుంచి వందలాది మంది వచ్చారని, వారికి అభివాదం చేయడానికి కూడా అవకాశం లేకుండా ప్రభుత్వం ఆంక్షలు విధించిందని తెలిపారు. ఆ కారణంగానే కనీసం నమస్కారం కూడా చేయలేకపోయానని కోరారు.
క్రిమినల్స్‌కు ఐఏఎస్, ఐపీఎస్‌ల సలాం..
‘‘ఐఏఎ్‌సలు, ఐపీఎ్‌సలు క్రిమినల్స్‌కు సలాం కొడుతున్నారు. నేనే నేర చరిత్ర ఉన్న రాజకీయ నాయకులతో పాలింపబడకూడదని అనుకుంటున్నాను. దాని కోసం నావంతు ప్రయత్నం చేస్తా. ఘటనతో సంబం ధం లేని 14 మంది జనసేన నాయకులు ఈ రోజు ఇంకా జైల్లో ఉన్నారు. జైలు శాఖ అధికారులు మా నాయకులను కొట్టినట్లు తెలిసింది. మరికొంత మంది ని మోకాళ్లపై నడిపించారని, బెల్ట్‌తో కొట్టారని విన్నా ను. సోమవారం సాయంత్రం మేము వచ్చిన తర్వాత మరో 54 మందిపై కేసులు పెట్టారు. మా నాయకులకు ఒక్కటే చెప్పాను. బలంగా నిలబడాలి. ఎదుర్కోవాలి. గొంతెత్తాలి.. ఆ క్రమంలో జైలుకు వెళ్లాలి. దెబ్బలు తినాలి. ఎన్నికలకు వెళ్లాలి అని చెప్పాను. వాళ్లు కూడా బలంగా పోరాడదామని చెప్పారు’’ అని జనసేనాని వివరించారు.
తారస్థాయికి ప్రభుత్వ దాష్టీకాలు
ప్రజా వ్యతిరేక విధానాలతో దాడులు: పవన్
బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుతో భేటీ
కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లా: సోము
అమరావతి, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధికారంలోకి వచ్చాక, రాజ్యాంగేతర, ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలతో ప్రత్యర్థి పార్టీల వ్యక్తులను బతకనీయడం లేదని, దాడులతో భయపెడుతున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. సోమవారం విజయవాడలోని నోవాటెల్ హోటల్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో ఆయన సమావేశయ్యారు. భవిష్యత్తు కార్యాచరణపై సుమారు గంట సేపు చర్చించారు. అనంతరం ఇద్దరూ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో గొడవలు ఉత్తరాంధ్రలో బీజేపీ కార్యకర్తతో వైసీపీ మొదలుపెట్టిందని పవన్ చెప్పారు. విజయనగరంలో బీజేపీ కార్యకర్తను కత్తులతో పొట్టకోసిన విషయాన్ని గుర్తుచేశారు. ఆ పరిస్థితులు తారస్థాయికి చేరాయన్నారు. విశాఖలో జనసేన నాయకులపై అన్యాయంగా కేసులు పెట్టడంపై ఎప్పటికప్పుడు వాకబు చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ మాధవ్, పురందేశ్వరి తదితర బీజేపీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. సోము వీర్రాజు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ దమనకాండను జనసేన, బీజేపీ కలిసి ఎదుర్కొంటాయన్నారు. పవన్ పట్ల పోలీసులు అత్యంత కిరాతకంగా వ్యవహరించిన తీరు, నెడుతూ మాట్లాడడం ప్రజాస్వామ్యంలో తీవ్ర ఆందోళన కలిగించే అంశాలన్నారు. జనసేన కార్యకర్తల మీద హత్యాయత్నం కేసులు పెట్టడం రాజ్యాంగా విరుద్ధమని ఖండించారు. ప్రభుత్వ దమనకాండను కేంద్ర పెద్దల వద్ద ప్రస్తావించామన్నారు. దీనిపై ప్రజల్లో ఉద్యమం చేయాలని కేంద్ర పెద్దలు చెప్పారని వివరించారు.
బెయిల్‌పై విడుదలైన వారితో భేటీ..
ప్రజా సమస్యలపై బలంగా గొంతు వినిపిద్దామని నాయకులు, కార్యకర్తలకు పవన్‌కల్యాణ్ పిలుపునిచ్చారు. విశాఖ నుంచి తిరు గు ప్రయాణమయ్యే ముందు పార్టీ నాయకులతోనూ, ఎయిర్‌పోర్టు ఘటనలో అరెస్టయ్యి, బెయిల్‌పై విడుదలైన వారితోనూ పవన్ సమావేశమయ్యారు. పోలీ్‌సస్టేషన్‌లో ఎదురై న ఇబ్బందులను వారు పవన్‌కు వివరించా రు. కస్టడీలో తమపై పోలీసులు చేయి చేసుకున్నారని తెలిపారు. భీమిలి నియోజకవర్గ ఇన్‌చార్జి పంచకర్ల సందీప్ పట్ల అమానుషం గా ప్రవర్తించారని చెప్పారు. వీర మహిళ రూపను అర్ధరాత్రి ఇంటికెళ్లి అరెస్టు చేశారని, ఆరోగ్యం సరిగా లేకున్నా, చంటి పిల్లలతో ఉన్నానని చెప్పినా వినిపించుకోలేదని, ఆమె ను ఇప్పటికీ జైల్లోనే ఉంచారని వివరించారు. నాయకులకు లీగల్ టీమ్ అండగా ఉంటుందని పవన్ భరోసా ఇచ్చారు. కేసులకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. జనసేన నా యకులపై చేయి వేసిన వారందరి పేర్లు నమోదు చేయాలని, పూర్తిస్థాయి నివేదిక సిద్ధం చేయాలని సూచించారు. ఇష్టానుసారంగా పోలీసులు చేయి చేసుకునే హక్కు లేదని చెప్పారు.
