Vistara AirIndia merger: టాటా గ్రూప్ కీలక ప్రకటన..
ABN , First Publish Date - 2022-11-29T21:13:45+05:30 IST
విమానయాన సంస్థ విస్తారాను (Vistara) ఎయిరిండియాలో (AirIndia) విలీనం చేస్తున్నట్టు టాటా గ్రూప్ (TATA Group) ప్రకటించింది. ఈ నిర్ణయంతో (Vistara AirIndia merger) మొత్తం 218 విమానాలతో దేశీయంగా, అంతర్జాతీయంగా ప్రధాన విమానయాన సంస్థగా ఎయిరిండియా అవతరించనుంది.
న్యూఢిల్లీ: విమానయాన సంస్థ విస్తారాను (Vistara) ఎయిరిండియాలో (AirIndia) విలీనం చేస్తున్నట్టు టాటా గ్రూప్ (TATA Group) ప్రకటించింది. ఈ నిర్ణయంతో (Vistara AirIndia merger) మొత్తం 218 విమానాలతో దేశీయంగా, అంతర్జాతీయంగా ప్రధాన విమానయాన సంస్థగా ఎయిరిండియా అవతరించనుంది. భారత అతిపెద్ద అంతర్జాతీయ విమాన సంస్థగా, దేశీయంగా రెండవ అతిపెద్ద క్యారియర్‌గా నిలవనుందని టాటా గ్రూప్ తన ప్రకటనలో పేర్కొంది. అవసరమైన అనుమతులన్ని దక్కడంతో ఎయిరిండియాలో విస్తారా విలీనమవనుందని తెలిపింది. విలీన ఒప్పందంలో భాగంగా ఎయిరిండియాలో ఎస్‌ఐఏ (Singapore Airlines) రూ.2,059 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా ఎయిరిండియాలో ఎస్ఐఏ 25.1 శాతం వాటాను హోల్డింగ్ చేయనుందని, ఈ లావాదేవీ మార్చి 2024 లోగా పూర్తయ్యే అవకాశముందని కంపెనీ అంచనా వేసింది.
ఎయిరిండియాలో విస్తారా విలీనంపై టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ స్పందించారు. ఎయిరిండియాను ప్రపంచస్థాయి ఎయిర్‌లైన్స్‌గా మార్చే తమ ప్రయాణంలో విస్తారా విలీనం ముఖ్యమైన మైలురాయి అని వ్యాఖ్యానించారు. ప్రతి వినియోగదారుడికి.. ప్రతిసారీ గొప్ప అనుభూతిని అందించడమే లక్ష్యంగా ఎయిరిండియాను రూపాంతరం చెందిస్తున్నట్టు ఆయన చెప్పారు. నెట్‌వర్క్ విస్తరణతోపాటు విమానాల సంఖ్య పెంపుపై దృష్టిసారించనున్నట్టు పేర్కొన్నారు. మరోవైపు కస్టమర్ల సంఖ్యను పెంచుకోవడం, భద్రత ప్రమాణాలు, విశ్వాసం పెంచుకునేందుకు సకాలంలో సర్వీసుల వంటి అంశాల మెరుగుదలకు కృషి చేస్తామని ఎన్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో పూర్తి స్థాయి సర్వీసులను తక్కువ రేటుకే అందించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.