AirIndia: సంచలన ఒప్పందానికి చేరువైన ఎయిరిండియా !

ABN , First Publish Date - 2022-12-11T21:46:51+05:30 IST

టాటా గ్రూపు (TATA Group) సారధ్యంలోని దేశీయ విమానయాన దిగ్గజం ఎయిరిండియా (AirIndia) చరిత్రాత్మక ఒప్పందానికి సిద్ధమైంది. పునరుద్ధరణే లక్ష్యంగా అడుగులు వేస్తున్న కంపెనీ ఏకంగా 500 విమానాల కొనుగోలు డీల్‌కు చేరువైంది.

AirIndia: సంచలన ఒప్పందానికి చేరువైన ఎయిరిండియా !

ప్యారిస్/న్యూఢిల్లీ: టాటా గ్రూపు (TATA Group) సారధ్యంలోని దేశీయ విమానయాన దిగ్గజం ఎయిరిండియా (AirIndia) చరిత్రాత్మక ఒప్పందానికి సిద్ధమైంది. పునరుద్ధరణే లక్ష్యంగా అడుగులు వేస్తున్న కంపెనీ ఏకంగా 500 విమానాల కొనుగోలు డీల్‌కు చేరువైంది. విమానతయారీ దిగ్గజాలైన ఎయిర్‌బస్ (Airbus), బోయింగ్ (Boeing) కంపెనీల నుంచి ఈ విమానాలను కొనుగోలు చేయబోతున్నట్టు రాయిటర్స్ (Reuters) రిపోర్ట్ పేర్కొంది.

ఈ ఆర్డర్‌లో 400 చిన్న విమానాలు, 100 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలో పెద్ద విమానాలను ఎయిరిండియా కొనుగోలు చేయనుంది. పెద్ద విమానాల్లో ఎయిర్‌బస్ ఏ350ఎస్, బోయింగ్ 787ఎస్, 777ఎస్ విమానాలు ఉండనున్నాయని రిపోర్ట్ పేర్కొంది. ఈ ఒప్పందం విలువ పదుల బిలియన్ల డాలర్ల మేర ఉండొచ్చని అంచనా వేసింది. కాగా రానున్న రోజుల వ్యవధిలోనే ఈ ఒప్పందం పూర్తయ్యే అవకాశాలున్నాయని సమాచారం. ఈ రిపోర్టులపై స్పందించేందుకు ఎయిర్‌బస్, బోయింగ్‌తోపాటు టాటా గ్రూప్ కూడా నిరాకరించాయి.

Updated Date - 2022-12-11T21:46:56+05:30 IST