Twitter: మస్క్‌కు గుడ్ న్యూస్ చెప్పిన అమెజాన్, యాపిల్..!

ABN , First Publish Date - 2022-12-04T20:59:57+05:30 IST

కార్పొరేట్ సంస్థలు బుజ్జగించడంలో మస్క్ ప్రయత్నాలు ఫలించడంతో ఆయా సంస్థలు తమ ప్రకటనలు పునరుద్ధరించాయి. యాపిల్, అమెజాన్ సంస్థలు ట్విటర్‌లో మళ్లీ ట్విటర్‌లో ప్రకటనలు ఇచ్చేందుకు ముందుకొచ్చాయి.

Twitter: మస్క్‌కు గుడ్ న్యూస్ చెప్పిన అమెజాన్, యాపిల్..!

వాషింగ్టన్: ఎలాన్ మస్క్‌(Elon Musk) చేతుల్లో ట్విటర్‌(Twitter) విద్వేషానికి(Hate) వేదికగా మారుతుందన్న భయంతో బడా కార్పొరేట్ సంస్థలు..ఈ సోషల్ మీడియా వేదికలో ప్రకటనలు నిలిపివేశాయి. అయితే.. వాటిని బుజ్జగించడంలో మస్క్ ప్రయత్నాలు ఫలించడంతో ఆయా సంస్థలు తమ ప్రకటనలు పునరుద్ధరించాయి. యాపిల్(Apple), అమెజాన్(Amazon) సంస్థలు ట్విటర్‌లో మళ్లీ ట్విటర్‌లో ప్రకటనలు ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. యాపిల్ సంస్థ ప్రకటనలు ఇవ్వడం ప్రారంభించినట్టు మస్క్ ఇటీవలే పేర్కొన్నారు. అమెజాన్ ఏటా ట్విటర్‌లో ప్రకటనలకు(Advertisements) 100 మిలియన్ డాలర్లు ఖర్చు చేసేందుకు సిద్ధమైనట్టు సమాచారం. అయితే..ఈ విషయమై ఎటువంటి అధికారిక ప్రకటనలు వెలువడలేదు. కానీ.. ‘‘అడ్వటైజర్లు అందరికీ నా ధన్యవాదాలు’’ అంటూ మస్క్ ట్వీట్ చేశారు. కాగా..మస్క్ ఇటీవల యాపిల్ కార్యాలయానికి వెళ్లారు. కార్యాలయం ప్రాంగణంలోని ఓ కొలను ఫొటోను ట్వీట్ చేశారు. యాపిల్ సీఈఓ టిమ్ కుక్.. తనకు దగ్గరుండి ఆఫీస్ మొత్తం చూపించారని మస్క్ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

మరోవైపు.. మస్క్ పెట్టిన మరో పోల్‌కు నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. అమెరికాలో బహిష్కరణకు గురైన విజిల్ బ్లోవర్ జూలియన్ అసాంజే, అడ్వర్డ్‌ స్నోడెన్‌కు క్షమాభిక్ష పెట్టాలని అనుకుంటున్నారా అని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు స్పందించిన వారిలో ఏకంగా 79 శాతం మంది అవుననే సమాధానం చెప్పడం గమనార్హం.

Updated Date - 2022-12-04T20:59:58+05:30 IST