ICICI loan fraud case: వీడియోకాన్ గ్రూప్ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్ అరెస్ట్
ABN , First Publish Date - 2022-12-26T12:08:44+05:30 IST
ఐసీఐసీఐ రుణ మోసం కేసులో వీడియోకాన్ గ్రూప్ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్‌ను సీబీఐ అరెస్టు చేసింది....
న్యూఢిల్లీ: ఐసీఐసీఐ రుణ మోసం కేసులో వీడియోకాన్ గ్రూప్ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్‌ను సీబీఐ అరెస్టు చేసింది.(Videocons Venugopal Dhoot) గతంలో ఇదే కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్తను సీబీఐ అరెస్ట్ చేసింది.(CBI arrests)చందా కొచ్చర్, దీపక్ కొచ్చర్ సహాయంతో ఐసీఐసీఐ బ్యాంకును మోసం చేసిన కేసులో(loan fraud case) ధూత్‌పై సీబీఐ విచారణ జరుపుతోంది.చందా కొచ్చర్, ఆమె భర్తను డిసెంబర్ 26 వరకు సీబీఐ కస్టడీకి అప్పగించారు. వీడియోకాన్ గ్రూప్ కంపెనీలకు బ్యాంకు మంజూరు చేసిన రుణాల్లో అవకతవకలు జరిగాయి.
వేణుగోపాల్ ధూత్ ప్రమోట్ చేసిన వీడియోకాన్ కంపెనీలకు బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, ఆర్బీఐ మార్గదర్శకాలు, బ్యాంక్ క్రెడిట్ విధానాన్ని ఉల్లంఘించి ఐసీఐసీఐ బ్యాంక్ రూ.3,250 కోట్ల రుణం మంజూరు చేసిందని దర్యాప్తు సంస్థ సీబీఐ ఆరోపించింది.చందా కొచ్చర్ నేతృత్వంలోని ఐసీఐసీఐ బ్యాంక్ మంజూరు కమిటీ బ్యాంకు నియమాలకు విరుద్ధంగా వీడియోకాన్ గ్రూపునకు రూ. 300 కోట్ల టర్మ్ లోన్ మంజూరు చేసింది. మరుసటి రోజు ధూత్ తన కంపెనీ సుప్రీం ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఎన్ఆర్ఎల్ కంపెనీకి రూ. 64 కోట్లు బదిలీ చేశారు.