FICCI: ఎక్స్‌ఆర్ ఓపెన్ సోర్స్ ఫెలోషిప్ ప్రోగ్రాంకు మెటా సహకారం
ABN , First Publish Date - 2022-12-01T20:18:22+05:30 IST
ఎక్స్ఆర్ ఓపెనర్ సోర్స్ (XROS) ఫెలోషిప్ ప్రోగ్రాం కోసం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FICCI)కి మిలియన్ డాలర్లు సమకూర్చేందుకు ముందుకొచ్చింది
న్యూఢిల్లీ: ఎక్స్ఆర్ ఓపెనర్ సోర్స్ (XROS) ఫెలోషిప్ ప్రోగ్రాం కోసం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FICCI)కి మిలియన్ డాలర్లు సమకూర్చేందుకు ముందుకొచ్చింది. ఇందులో భాగంగా ఎక్స్ఆర్ (extended reality) సాంకేతికపై పనిచేసేందుకు 100 మంది ఇండియన్ డెవలపర్లకు ఫిక్కీ ఆధ్వర్యంలో నడిచే ఎక్స్ఆర్ఓఎస్ మద్దతు అందిస్తుంది. ఇందులో భాగంగా వారికి స్టైఫండ్స్ వంటి ఫెలోషిప్స్ అందిస్తుంది. ఈ కార్యక్రమానికి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) సారథ్యంలో పనిచేస్తున్న జాతీయ ఈ-గవర్నెన్స్ విభాగం దీనికి సాంకేతిక భాగస్వామిగా ఉంటుంది.
ఎక్స్ఆర్ సాంకేతికతకు సంబంధించిన ఓపెన్ సోర్స్ ప్రాజెక్టులకు సహకారం అందించేందుకు డెవలపర్ ప్రోగ్రాం సహకరిస్తుంది. అంతేకాకుండా, సముచితమైన, భారతీయ భాషలకు స్థానికీకరించిన దేశ నిర్దిష్ట పరిష్కారాలకు మరింత పునాది వేస్తుంది. ఎక్స్ఆర్ఓఎస్ (XROS) ప్రోగ్రాం మెటాకు చెందిన గ్లోబల్ ఎక్స్ఆర్ ప్రోగ్రాంలు, రీసెర్చ్ ఫండ్‌లో భాగం. ఇందులో భాగంగా కంపెనీ ఈ ఏడాది ప్రారంభంలో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ స్టార్టప్ హబ్‌తో ఎక్స్ఆర్ స్టార్టప్ ప్రోగ్రాం కోసం 2 మిలియన్ డాలర్ల నిధిని ప్రకటించింది.
మెటా(Meta) మద్దతు సపోర్ట్ ఉన్న ఓపెన్ సోర్స్ ఇనిషియేటివ్‌లలో నో లాంగ్వేజ్ లెఫ్ట్ బిహైండ్ (NLLB), 25 భారతీయ భాషలతో సహా 200 తక్కువ రిసోర్స్ లాంగ్వేజ్‌లకు సహకరించే ఒకే బహుభాషా ఏఐ మోడల్ ఉన్నాయి. కంపెనీ గతేడాది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా వచ్చే మూడేళ్లలో 10 మిలియన్ల మందికిపైగా విద్యార్థులు, మిలియన్ అధ్యాపకులకు ఇమ్మెర్స్ టెక్నాలజీని అందిస్తుంది. సీబీఎస్‌సీతో భాగస్వామ్యం మెటా నిబద్ధతను నొక్కి చెబుతుంది. అలాగే, ‘స్టెమ్’(STEM) ఎడ్యుకేషన్‌ను విశ్వవ్యాప్తం చేయాలన్న ఉమ్మడి ఆశయాన్ని ప్రతిబింబిస్తుంది. అలాగే, డిజిటల్‌తో నడిచే ఆర్థిక వ్యవస్థలో భవిష్యత్తు కోసం వారిని సిద్ధం చేస్తుంది.