Flipkart Axis Bank Super Elite Credit Card: ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ ఎలైట్ క్రెడిట్ కార్డు.. ప్రయోజనాలు ఇవే!
ABN , First Publish Date - 2022-11-05T21:24:18+05:30 IST
ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంకు నుంచి మరో క్రెడిట్ కార్డు వచ్చేస్తోంది. భారతీయ వినియోగదారులను ఉద్దేశించి తీసుకొస్తున్న ఈ కార్డు పేరు ‘ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్
న్యూఢిల్లీ: ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంకు నుంచి మరో క్రెడిట్ కార్డు వచ్చేసింది. భారతీయ వినియోగదారులను ఉద్దేశించి తీసుకొస్తున్న ఈ కార్డు పేరు ‘ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ సూపర్ ఎలైట్ క్రెడిట్ కార్డు’. దీనిని ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోళ్లతోపాటు బయటి కొనుగోళ్లకు కూడా ఉపయోగించుకోవచ్చు. అలాగే, ఫ్లిప్‌కార్ట్ రివార్డు ప్రోగ్రామ్ ద్వారా ప్రతి లావాదేవీ తర్వాత వినియోగదారులు అదనపు డీల్స్, డిస్కౌంట్స్ కోసం ఉపయోగించే సూపర్ కాయిన్స్‌ను పొందొచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంకు ఆవిష్కరించిన ఈ కొత్త కార్డును ఎంచుకోవడం ద్వారా వినియోగదారులకు అనేక ప్రయోజనాలు లభిస్తాయి. ఈ కార్డుతో లభించే ప్రయోజనాలపై ఓ లుక్కేద్దాం.
* కార్డు యాక్టివేట్ అయిన వెంటనే 500 సూపర్ కాయిన్స్ లభిస్తాయి
* ఫ్లిప్‌కార్ట్ ఫ్లైట్స్‌పై 15 శాతం రాయితీ లభిస్తుంది
* ఫ్లిప్‌కార్ట్ హెల్త్ ప్లస్‌లో ఐటెమ్స్ కొనుగోళ్లపై 30 శాతం
* మింత్రాపై రూ. 500
* 10 క్లియర్ ట్రిప్ ద్వారా ఫ్లైట్ కొనుగోళ్లపై 10 శాతం రాయితీ
* రెండు నెలలపాటు యూట్యూబ్ ప్రీమియం ట్రయల్ మెంబర్‌షిప్
* క్లియర్ ట్రిప్ ద్వారా చేసే హోటల్ బుకింగ్స్‌పై 25 శాతం రాయితీ
* ఏడాదిపాటు లెన్స్‌కార్ట్ గోల్డ్ మెంబర్‌షిప్
* గానా ప్లస్‌పై మూడు నెలల ట్రయల్ సబ్‌స్క్రిప్షన్
ఫ్లిప్‌కార్ట్‌లో కస్టమర్లు ఖర్చు చేసే ప్రతి 100 రూపాయలకు అదనంగా 12 సూపర్ కాయిన్స్ లభిస్తాయి. సూపర్ ఎలైట్ క్రెడిట్ కార్డును ఉపయోగించే వినియోగదారులు ఈ కార్డును ఉపయోగించి ఫ్లిప్‌కార్ట్ వెలుపల చేసే లావాదేవీలపై ఖర్చు చేసే ప్రతి రూ. 100కు రెండు సూపర్ కాయిన్స్ లభిస్తాయి. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులు అయితే రూ. 2,500 లేదంటే అంతకంటే ఎక్కువ ఖరీదు చేసే ఏదైనా లావాదేవీకి గరిష్ఠంగా 400 సూపర్ కాయిన్‌లను సంపాదించవచ్చు. దీంతోపాటు మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయి.