అమెజాన్‌లో 10,000 మంది ఇంటికి!

ABN , First Publish Date - 2022-11-15T01:58:08+05:30 IST

అమెరికా టెక్‌ కంపెనీల్లో తీసివేతల పర్వం కొనసాగుతోంది. ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ 10,000 మంది ఉద్యోగులను తీసివేయబోతున్నట్టు న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక...

అమెజాన్‌లో 10,000 మంది ఇంటికి!

న్యూయార్క్‌: అమెరికా టెక్‌ కంపెనీల్లో తీసివేతల పర్వం కొనసాగుతోంది. ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ 10,000 మంది ఉద్యోగులను తీసివేయబోతున్నట్టు న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ఒక కథనం ప్రచురించింది. వచ్చే కొద్ది రోజుల్లోనే ఈ తీసివేతలు ఉంటాయని తెలిపింది. అమెరికాలో అమెజాన్‌ కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగుల్లో ఇది దాదాపు మూడు శాతానికి సమానం. రిటైల్‌, వాయిస్‌ ఆధారిత అలెక్సా, మానవ వనరుల అభివృద్ధి విభాగంలో ఎక్కువగా ఈ తీసివేతలు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ట్విటర్‌, మైక్రోసాఫ్ట్‌తో సహా అనేక అమెరికా టెక్‌ కంపెనీలు ఇప్పటికే వేల మందిని ఇంటికి పంపాయి. రోజు రోజుకీ క్షీణిస్తున్న ఆర్థిక పరిస్థితులు ఇందుకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు.

Updated Date - 2022-11-15T01:58:14+05:30 IST