మార్కెట్లో మునరా ఆగ్రో ఉత్పత్తులు

ABN , First Publish Date - 2022-06-06T08:41:27+05:30 IST

మునరా ఆగ్రో టెక్నాలజీస్‌ కంపెనీ బయో ఉత్ప త్తులను మార్కెట్‌లో విడుదల చేసింది.

మార్కెట్లో మునరా ఆగ్రో ఉత్పత్తులు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): మునరా ఆగ్రో టెక్నాలజీస్‌ కంపెనీ  బయో ఉత్ప త్తులను మార్కెట్‌లో విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి ఈ ఉత్పత్తులను విడుదల చేశారు. సింగపూర్‌కు చెందిన యునైటెడ్‌ అలక్రిటీ లిమిటెడ్‌ (యూఎఎల్‌) భాగస్వామ్యంలో మునరా ఆగ్రో ఈ ఉత్పత్తులను రూపొందించినట్టు కంపెనీ డైరెక్టర్‌ సీఎస్‌ఆర్‌నాయుడు ఈ సంద ర్భంగా తెలిపారు. రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులకు బదులుగా పంటలపై ఈ బయో ఉత్పత్తులను వాడుకోవచ్చు. రాష్ట్రంలో మరింతగా సేంద్రి య వ్యవసాయాన్ని విస్తరించబోతున్నట్టు తెలిపారు. మునరా ఆగ్రో ఉత్పత్తులు మానవ ఆరోగ్యంతో పాటు పర్యావరణం, భూసారాన్ని కూడా కాపాడతాయన్నారు. 

Updated Date - 2022-06-06T08:41:27+05:30 IST