Meesho: ఏపీలో 330కిపైగా ‘మీషో’ లక్షాధికారులు

ABN , First Publish Date - 2022-12-22T18:36:12+05:30 IST

దేశంలోని ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ మీ షో (Meesho)కు 2022 అద్వితీయమైన ఏడాదిగా మిగిలింది.

Meesho: ఏపీలో 330కిపైగా ‘మీషో’ లక్షాధికారులు
Meesho

విజయవాడ: దేశంలోని ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ మీ షో (Meesho)కు 2022 అద్వితీయమైన ఏడాదిగా మిగిలింది. ఇంటర్నెట్ వాణిజ్యాన్ని ప్రతి ఒక్కరికీ చేరువచేయాలన్నలక్ష్యాన్ని సాకారం చేసే దిశగా ఎన్నో మైలురాళ్లను చేరుకుంది. విక్రయాల పరంగా ఈ ఏడాది మూడు రికార్డులను కొల్లగొట్టింది. ఏపీ నుంచి అధిక సంఖ్యలో ఎంఎస్ఈఎం (MSME)లు మీషోలో చేరారు. గత 12 నెలల కాలంలో దాదాపు 330 మంది ఎంఎస్ఈఎంలు లక్షాధికారులుగా మారారు. ఏపీ నుంచి ఈ ఏడాది మీషోలో చేరిన సరఫరాదారుల సంఖ్య 37 శాతానికి పైగా పెరిగింది. వీరిలో 70 శాతం మంది తమ ఈ-కామర్స్ ప్రయాణాన్ని మీషోతో ప్రారంభించారు. ఏపీ వినియోగదారుల్లో ఎక్కువమంది స్మార్ట్‌వాచ్‌లు, వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్, ఇయర్ ఫోన్స్, బాడీలోషన్స్, కుర్తీలు తదితర వాటిపై ఆసక్తి కనబరుస్తున్నారు.

2022లో కొనుగోలు ఇలా..

ఈ ఏడాది మీ షో విక్రేతలు రూ. 3700 కోట్లను కమీషన్ చెల్లించాల్సిన పనిలేకుండా ఆదా చేసుకోగలిగారు. ఇందుకు జీరో కమీషన్ మోడల్ తోడ్పడింది. దేశవ్యాప్తంగా ఎస్ఎంబీలు డిజిటలైజ్ అయ్యాయి. ఈ ఏడాది మీషోలో 5 లక్షల మంది సరఫరాదారులు చేరారు. వీరిలో 61శాతం మంది ఈ-కామర్స్‌కు రావడం తొలిసారి. అంతేకాదు, ఆన్‌లైన్‌లో విక్రయించడం కూడా మొదటిసారే.

షాపింగ్ ప్రైమ్ టైమ్

సెలవు రోజైన ఆదివారం ఆన్‌లైన్ షాపింగ్‌కు భారతీయులు అత్యంత అనువైన రోజుగా భావిస్తున్నారు. ఈ ఏడాది ఎక్కువ కొనుగోళ్లు ఆదివారం రోజునే జరిగాయి. గత ఏడాది మాత్రం బుధవారం రోజున అత్యధిక కొనుగోళ్లు జరిగాయి. రోజూ రాత్రి 8గంటలకు మీషో షాపింగ్ ప్రైమ్ టైమ్‌గా కొనసాగింది. గతేడాది మాత్రం మధ్యాహ్నం 2-3 గంటల మధ్య అధిక ట్రాఫిక్ కనిపించింది.

ఈ ఏడాది ఎక్కువమంది వెతికిన రెండో ఉత్పత్తిగా స్మార్ట్‌వాచ్ నిలిచింది. గ్రూమింగ్ ఉత్పత్తులకు పురుషులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. టయర్ 4 మార్కెట్ల నుంచి 60 శాతానికిపైగా ఆర్డర్లు లభించాయి. టయర్ 2 నగరాల నుంచి శానిటరీ ఆర్డర్లు 9 రెండు పెరిగాయి. నిమిషానికి 148 చీరలు అమ్ముడుపోయాయి. 93వేల టీషర్టులు, 51,275 బ్లూ టూత్‌ ఇయర్‌ఫోన్లు, 21,662 లిప్‌స్టిక్స్‌ ప్రతి రోజూ వినియోగదారులు కొనుగోలు చేశారు

Updated Date - 2022-12-22T18:36:24+05:30 IST