Paytm: మీ మొబైల్లో పేటీఎం యాప్ ఉందా?.. అయితే మీకో గుడ్‌న్యూస్..

ABN , First Publish Date - 2022-11-21T16:40:37+05:30 IST

పేటీఎం (Paytm) వినియోగదారులకు గుడ్‌న్యూస్. ఇకపై ఏ ఇతర యూపీఐ పేమెంట్ యాప్‌‌కు చెందిన మొబైల్ నంబర్‌కైనా పేటీఎం యాప్ నుంచి యూపీఐ పేమెంట్లు (UPI Payments) చేయవచ్చు.

Paytm: మీ మొబైల్లో పేటీఎం యాప్ ఉందా?.. అయితే మీకో గుడ్‌న్యూస్..

న్యూఢిల్లీ: పేటీఎం (Paytm) వినియోగదారులకు గుడ్‌న్యూస్. ఇకపై ఏ ఇతర యూపీఐ పేమెంట్ యాప్‌‌కు చెందిన మొబైల్ నంబర్‌కైనా పేటీఎం యాప్ నుంచి యూపీఐ పేమెంట్లు (UPI Payments) చేయవచ్చు. గ్రహిత (recipient ) పేటీఎం యాప్‌పై రిజిస్టర్ కాకపోయినా పేమెంట్లకు ఎలాంటి అవరోధం ఉండదు. ఈ మేరకు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL) ప్రకటన చేసింది. ఏ పేమెంట్ యాప్ అయినా సరే రిజిష్టర్డ్ యూపీఐ ఐడీ కలిగివున్న అన్ని మొబైల్ నంబర్లకు డబ్బు పంపించొచ్చు, స్వీకరించవచ్చునని పీపీబీఎల్ తెలిపింది. కాగా ఎన్‌పీసీఐ (National Payments Corporation of India) అన్నీ పేమెంట్ సర్వీసెస్ ప్రొవైడర్లకు డేటా బేస్ యాక్సెస్‌ను ఇచ్చింది. అంతేకాకుండా యూపీఐ పేమెంట్స్ సమాచారాన్ని ఉపయోగించుకునేందుకు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే.

ఇలా పంపించాలి..

1. పేటీఎం యాప్‌పై ‘యూపీఐ మనీ ట్రాన్స్‌ఫర్’ సెక్షన్‌లో ‘ టు యూపీఐ యాప్స్’పై ట్యాప్ చేయాలి.

2. ‘ఎంటర్ మొబైల్ నంబర్’పై ట్యాప్ చేయాలి. అక్కడ గ్రహిత మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.

3. పంపించాల్సిన మనీ ఎంతో ఎంటర్ చేశాక.. క్విక్ మనీ ట్రాన్స్‌ఫర్ కోసం ‘పే నౌ’పై ట్యాప్ చేయాలి.

కాగా ఏ యూపీఐ యాప్‌కైనా మనీ ట్రాన్స్‌ఫర్ చేసే సౌలభ్యం అందుబాటులోకి రావడం యూపీఐ పేమెంట్స్‌ వ్యవస్థలో కీలక పరిణామమని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. దీని ద్వారా చెల్లింపులు మరింత వృద్ధి చెందుతాయని ఆశిస్తున్నట్టు చెప్పారు. యూపీఐ పేమెంట్స్ విషయంలో అగ్రభాగాన కొనసాగునున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. నిరంతరాయ, భద్రమైన పేమెంట్ల కోసం దృఢమైన సౌకర్యాలను అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేశారు. దేశంలో ఆర్థిక సమగ్రత బలోపేతంలో తమవంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు. కాగా ఎన్‌పీసీఐ తాజా రిపోర్ట్ ప్రకారం.. అక్టోబర్ 2022లో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ మొత్తం 362 మిలియన్ లావాదేవీలను నమోదు చేసింది.

Updated Date - 2022-11-21T19:23:26+05:30 IST