Bisleri: ఓన్లీ Bisleri వాటర్ బాటిల్‌ నీళ్లే తాగుతుంటారా.. అయ్యో పాపం..!

ABN , First Publish Date - 2022-11-24T15:18:41+05:30 IST

భారత్‌లో ప్యాక్డ్ డ్రింకింగ్ వాటర్ బ్రాండ్స్‌లో ఎక్కువ మంది ఎంచుకునే ఆప్షన్స్‌లో Bisleri ఒకటి. జర్నీ చేసే సమయంలో Bisleri బ్రాండ్‌ వాటర్ బాటిల్ కొనేందుకు ప్రయాణికులు ఎక్కువగా..

Bisleri: ఓన్లీ Bisleri వాటర్ బాటిల్‌ నీళ్లే తాగుతుంటారా.. అయ్యో పాపం..!

భారత్‌లో ప్యాక్డ్ డ్రింకింగ్ వాటర్ బ్రాండ్స్‌లో ఎక్కువ మంది ఎంచుకునే ఆప్షన్స్‌లో Bisleri ఒకటి. జర్నీ చేసే సమయంలో Bisleri బ్రాండ్‌ వాటర్ బాటిల్ కొనేందుకు ప్రయాణికులు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. అలాంటి.. బిస్లరీ త్వరలో కాలగర్భంలో కలిసిపోనుంది. బిస్లరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్ రమేష్ చౌహాన్ ఈ సంస్థను టాటాకు విక్రయించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈ డీల్ విలువ దాదాపు రూ.6000 కోట్ల నుంచి రూ.7000 కోట్ల మధ్య ఉందని Economic Times రిపోర్ట్ చేసింది. రమేష్ చౌహాన్ ఆరోగ్యం సరిలేకపోవడం, ఆయన కుమార్తెకు బిజినెస్‌పై ఆసక్తి లేకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. టాటా ఇప్పటికిప్పుడు టేకోవర్ చేసుకున్నప్పటికీ ప్రస్తుతం కొనసాగుతున్న మేనేజ్‌మెంట్ రెండేళ్ల పాటు కొనసాగాలన్న ఒప్పందంతో డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. రూ.220 కోట్ల లాభంతో అతి పెద్ద ప్యాక్డ్ డ్రింకింగ్ వాటర్ కంపెనీగా 2022-23 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.2,500 కోట్ల టర్నోవర్‌తో కొనసాగుతున్న సంస్థ బిస్లరీ కావడం గమనార్హం.

tata.jpg

టాటా ఇప్పటికే ప్యాక్డ్ డ్రింకింగ్ వాటర్ బిజినెస్‌లో హిమాలయన్ బ్రాండ్ పేరుతో, Tata Copper Plus Water బ్రాండ్ పేరుతో మినరల్ వాటర్‌ను Tata Consumer Products Ltd (TCPL) విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. Hydration Segment లో కూడా Tata Gluco+ కు మంచి మార్కెట్ ఉంది. 2021 ఆర్థిక సంవత్సరం నాటికి ఇండియన్ బాటిల్డ్ వాటర్ మార్కెట్ 19,315 కోట్ల రూపాయల బిజినెస్ చేరుకుందని మార్కెట్ రీసెర్చ్ అండ్ అడ్వైజరీ టెక్‌సి రీసెర్చ్ రిపోర్ట్ వెల్లడించింది.

ఇదిలా ఉండగా.. బిస్లరీని అమ్మేయాలనే నిర్ణయానికి రావడం చాలా బాధ కలిగించిందని, టాటా గ్రూప్ మరింత మెరుగ్గా వ్యాపారాన్ని ముందుకు తీసుకెళుతుందని రమేష్ చౌహాన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇతర బయ్యర్ల కంటే టాటా సంస్థ వైపే తాను మొగ్గుచూపడానికి కారణం టాటా గ్రూప్ పాటించే విలువలేనని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా.. ఈ డీల్‌కు సంబంధించి మాటామంతీ రెండేళ్ల క్రితం నుంచే జరిగినట్లు తెలిసింది.

Updated Date - 2022-11-24T15:20:23+05:30 IST