ధరల సెగ తగ్గుతోంది

ABN , First Publish Date - 2022-08-24T06:25:13+05:30 IST

మేలో గరిష్ఠ స్థాయికి చేరిన ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుముఖం పడుతోందని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తి కాంత దాస్‌ అన్నారు. అ యినా ఈ విషయంలో అప్రమత్తంగానే

ధరల సెగ తగ్గుతోంది

న్యూఢిల్లీ: మేలో గరిష్ఠ స్థాయికి చేరిన ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుముఖం పడుతోందని ఆర్‌బీఐ గవర్నర్‌  శక్తి కాంత దాస్‌ అన్నారు. అ యినా ఈ విషయంలో అప్రమత్తంగానే ఉన్నట్టు తెలిపారు. రిటైల్‌ ద్రవ్యోల్బణం ఇప్పట్లో నాలుగు శాతానికి తగ్గే అవకాశం లేదని కూడా స్పష్టం చేశారు. ఇందుకోసం ఎంత లేదన్నా మరో రెండేళ్లు ఆగక తప్పదన్నారు. జీడీపీ వృద్ధి రేటుకు ఇబ్బంది లేకుండా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలన్నదే తమ లక్ష్యమని దాస్‌ ఒక చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.


ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎ్‌సబీ) ప్రైవేటీకరణపై తమది తటస్థ వైఖరేనని దాస్‌ స్పష్టం చేశారు. ‘బ్యాంకుల యాజమాన్యం ఎవరిది ఎవరికి ఎంత వాటా ఉంది. అనే విషయాలు మాకు అనవసరం. మా పనల్లా  ఆర్‌బీఐ నిబంధనలకు లోబడి సమర్ధవంతంగా పని చేస్తు న్నాయా, లేదా పర్యవేక్షించడమే’ అని చెప్పారు.  

Updated Date - 2022-08-24T06:25:13+05:30 IST