RBI: ఆర్బీఐ కీలక నిర్ణయం.. నవంబర్ 3న..
ABN , First Publish Date - 2022-10-27T19:41:44+05:30 IST
కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ (RBI) కీలకమైన నిర్ణయం తీసుకుంది. నవంబర్ 3న ప్రత్యేక ఎంపీసీ (Monetary Policy Committee) భేటీ నిర్వహించనున్నట్టు ప్రకటించింది.

బెంగళూరు: కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ (RBI) కీలకమైన నిర్ణయం తీసుకుంది. నవంబర్ 3న ప్రత్యేక ఎంపీసీ (Monetary Policy Committee) భేటీ నిర్వహించనున్నట్టు ప్రకటించింది. దేశీయ ద్రవ్యోల్బణం వరుసగా మూడు త్రైమాసికాలపాటు 6 శాతం కంటే తక్కువగా ఉండేలా నియంత్రించడంలో విఫలమవ్వడంపై నివేదిక రూపొందించనున్నట్టు (RBI meet) తెలిపింది. ఆర్బీఐ చట్టంలోని (RBI Act) సెక్షన్ 45జెడ్ఎన్ నిబంధన కింద అదనంగా ఎంపీసీ భేటీ నిర్వహించవచ్చునని, ఇందుకు అనుగుణంగానే నవంబర్ 3, 2022న ప్రత్యేక భేటీ నిర్వహించనున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా ద్రవ్యోల్బణం నియంత్రణలో విఫలమైతే ప్రత్యేక ఎంపీసీ భేటీ నిర్వహించేందుకు సెక్షన్ 45జెడ్ఎన్ నిబంధన అవకాశం కల్పిస్తోంది. కాగా దేశీయ ద్రవ్యోల్బణం ఆర్బీఐ గరిష్ఠ పరిమితి 6 శాతం కంటే ఎక్కువగా ఉంది. గత తొమ్మిది నెలలుగా ద్రవ్యోల్బణం 6 శాతం కంటే ఎక్కువగానే నమోదవుతున్న విషయం తెలిసిందే.