Jio: మరోమారు దుమ్మురేపిన జియో.. డౌన్‌లోడ్, అప్‌లోడ్ వేగాల్లో నంబర్ వన్!
ABN , First Publish Date - 2022-11-17T17:21:14+05:30 IST
దేశంలోని అగ్రగామి టెలికం కంపెనీ రిలయన్స్ జియో (Jio) మరోమారు సత్తా చాటింది. 4జీ డౌన్‌లోడ్,
న్యూఢిల్లీ: దేశంలోని అగ్రగామి టెలికం కంపెనీ రిలయన్స్ జియో (Jio) మరోమారు సత్తా చాటింది. 4జీ డౌన్‌లోడ్, అప్‌లోడ్ స్పీడ్‌లో మరోమారు అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ (TRAI) నివేదిక విడుదల చేసింది. ట్రాయ్ గణాంకాల ప్రకారం సెప్టెంబరులో జియో 4జీ డౌన్‌లోడ్ సగటు వేగం 19.1 ఎంబీపీఎస్ కాగా, అక్టోబరులో అది 20.3 ఎంబీపీఎస్‌కు పెరిగింది. అదే సమయంలో అక్టోబరులో భారతీ ఎయిర్‌టెల్ (Bharti Airtel) 4జీ డౌన్‌లోడ్ వేగం 15 ఎంబీపీఎస్ కాగా, వి (Vodafone Idea) 14.5 ఎంబీపీఎస్‌గా ఉంది. ఈ రెండింటితో పోలిస్తే జియో సగటు డౌన్‌లోడ్ వేగం 5 ఎంబీపీఎస్ ఎక్కువ.
అప్‌లోడ్ వేగంలోనూ జియోదే అగ్రస్థానం. ఈ విషయంలో తొలిసారి సెప్టెంబరులో అగ్రస్థానానికి చేరుకున్న జియో.. అక్టోబరులోనూ తన స్థానాన్ని పదిలపరుచుకుంది. 6.2 ఎంబీపీఎస్ సగటు 4జీ అప్‌లోడ్ వేగంతో జియో టాప్‌లో నిలిచింది. వి (Vodafone Idea) 4.5 ఎంబీపీఎస్ అప్‌లోడ్ వేగంతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఈ విషయంలో ఎయిర్‌టెల్ పరిస్థితి దారుణంగా ఉంది. అక్టోబరులో ఎయిర్‌టెల్ 4జీ అప్‌లోడ్ వేగం 2.7 ఎంబీపీఎస్‌గా ఉంది. జియోతో పోలిస్తే ఎయిర్‌టెల్ అప్‌లోడ్ వేగం సగానికంటే తక్కువ కావడం గమనార్హం.