ఏఏఏఐ బోర్డులోకి శ్లోక అడ్వర్‌టైజింగ్‌ ఎండీ శ్రీనివాస్‌

ABN , First Publish Date - 2022-11-30T01:24:00+05:30 IST

అడ్వర్‌టైజింగ్‌ ఏజెన్సీస్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఏఏఏఐ) బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌గా శ్లోక అడ్వర్‌టైజింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ...

ఏఏఏఐ బోర్డులోకి శ్లోక అడ్వర్‌టైజింగ్‌ ఎండీ శ్రీనివాస్‌

హైదరాబాద్‌: అడ్వర్‌టైజింగ్‌ ఏజెన్సీస్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఏఏఏఐ) బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌గా శ్లోక అడ్వర్‌టైజింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ కే శ్రీనివాస్‌ ఎన్నికయ్యారు. 2022-23 సంవత్సరానికి గాను ఆయన బోర్డు సభ్యుడిగా వ్యవహరించనున్నారు. అడ్వర్‌టైజింగ్‌, మార్కెటింగ్‌ రంగాల్లో శ్రీనివా్‌సకు 30 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. దక్షిణాదిలో శ్లోక అడ్వర్‌టైజింగ్‌ను అత్యుత్తమ ఏజెన్సీగా ఆయన తీర్చిదిద్దారు. ప్రతిష్ఠాత్మకమైన ఏఏఏఐ బోర్డులోకి ఎన్నికవటం ఎంతో సంతోషాన్నిస్తోందని శ్రీనివాస్‌ అన్నారు. మీడియా, అడ్వర్‌టైజర్స్‌కు మధ్య వ్యాపార కార్యకలాపాలను మరింత బలోపేతం చేసేందుకు ఇతర బోర్డు సభ్యులతో కలిసి పనిచేయనున్నట్లు ఆయన చెప్పారు. కాగా ఏఏఏఐ ప్రెసిడెంట్‌గా గ్రూప్‌ ఎం మీడియా (సౌత్‌ ఏషియా) సీఈఓ ప్రశాంత్‌ కుమార్‌ ఎన్నికయ్యారు.

Updated Date - 2022-11-30T01:24:08+05:30 IST