Yamaha Blue Square Outlet: ఏలూరులో బ్లూస్కేర్ అవుట్‌లెట్‌ను ప్రారంభించిన యమహా
ABN , First Publish Date - 2022-12-31T21:09:26+05:30 IST
ఇండియా యమహా మోటార్ (IYM) ప్రైవేట్ లిమిటెడ్ ఏలూరులో తమ నూతన బ్లూ స్క్వేర్ ఔట్లెట్(Blue Square Outlet)ను ప్రారంభించింది.
అమరావతి: ఇండియా యమహా మోటార్ (IYM) ప్రైవేట్ లిమిటెడ్ ఏలూరులో తమ నూతన బ్లూ స్క్వేర్ ఔట్లెట్(Blue Square Outlet)ను ప్రారంభించింది. లక్ష్మీ మోటర్స్ పేరుతో ప్రారంభించిన ఈ షోరూమ్‌ను విశాలంగా నిర్మించారు. ఇందులో సేల్స్, స్పేర్స్ సేవలు లభిస్తాయి.
బ్లూ స్క్వేర్ షోరూమ్‌లలో మాత్రమే విక్రయించే మ్యాక్సీ స్పోర్ట్స్ ఎరాక్స్ 155 (AEROX 155) స్కూటర్‌తో పాటు ఏబీఎస్(ABS) వైజడ్ఎఫ్-ఆర్15ఎస్(YZF-R15S) వెర్షన్ 4.0 (155cc); ఏబీఎస్‌తో వైజడ్ఎఫ్-ఆర్15ఎస్ వెర్షన్ 3.0 (155 సీసీ), ఏబీఎస్‌తో ఎంటీ-15 (155cc) వెర్షన్ 2.0, బ్లూ కోర్ టెక్నాలజీ ఆధారిత మోడల్స్ అయిన ఎఫ్‌జడ్ 25 (249 సీసీ) ఏబీఎస్‌తో, ఫేజర్ 25 (249 cc) ఏబీఎస్‌తో, ఎఫ్‌జడ్-ఎస్ ఎఫ్1 (149 సీసీ) ఏబీఎస్‌తో, ఎఫ్‌జడ్-ఎఫ్1(14సీసీ) ఏబీఎస్‌తో, ఎఫ్‌జెడ్–ఎక్స్(149సీసీ) ఏబీఎస్‌తో, యూబీఎస్ ఆధారిత స్కూటర్లు అయిన ఫాసినో 125 ఎఫ్ఐ హైబ్రిడ్ (125సీసీ), రేజడ్ఆర్ 125 ఎఫ్ఐ హైబ్రిడ్ (125cc), స్ట్రీట్ ర్యాలీ 125 ఎఫ్ఐ హైబ్రిడ్ (125cc) ఉంటాయి.
తాజా అవుట్లెట్ ఏపీలో ఐదోది. తమిళనాడు, పాండిచ్చేరి, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, అసోం, చత్తీస్‌గఢ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, జమ్మూకశ్మీర్, ఢిల్లీ, రాజస్థాన్, ఈశాన్య రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా 137 బ్లూ స్క్వేర్ షోరూములను యమహా నిర్వహిస్తోంది.