చిరుత చర్మం స్వాధీనం : ఒకరి అరెస్టు

ABN , First Publish Date - 2022-10-21T15:39:33+05:30 IST

తూత్తుకుడి అమెరికన్‌ ఆసుపత్రి రౌండ్‌ఠాణా వద్ద అనుమానాస్పదంగా సంచరించిన ఓ వ్యక్తి వద్ద అటవీ శాఖ అధికారులు రూ.20లక్షల విలు వైన

చిరుత చర్మం స్వాధీనం : ఒకరి అరెస్టు

చెన్నై, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): తూత్తుకుడి అమెరికన్‌ ఆసుపత్రి రౌండ్‌ఠాణా వద్ద అనుమానాస్పదంగా సంచరించిన ఓ వ్యక్తి వద్ద అటవీ శాఖ అధికారులు రూ.20లక్షల విలువైన చిరుతపులి(Leopard) చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. తూత్తుకుడిలో పులిచర్మాలను అక్రమంగా తరలిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందటంతో ఆ ప్రాంతంలో పోలీసులతో కలిసి తనిఖీలు చేసారు. ఆ సమయంలో పెద్ద సంచి పట్టుకుని అనుమానస్పందంగా సంచరించిన  సూర్యనారాయణన్‌ (42) అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి చేతి సంచిలో చూడగా అందులో చిరుతపులి చర్మం లభించింది. వెంటనే అతడిని పోలీసులు అరెస్టు చేసి ఆ చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. 


Updated Date - 2022-10-21T15:39:33+05:30 IST