Revolver: మెరీనా బీచ్‌లో జర్మన్‌ రివాల్వర్‌ లభ్యం

ABN , First Publish Date - 2022-10-27T10:10:53+05:30 IST

స్థానిక మెరీనా బీచ్‌(Marina Beach)లో లభ్యమైన జర్మన్‌ రివాల్వర్‌ సొంతదారుడిని గుర్తించేదుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మెరీనా బీచ్‌ ఎల్లయమ్మన్‌ ఆలయం వీధిలోని

Revolver: మెరీనా బీచ్‌లో జర్మన్‌ రివాల్వర్‌ లభ్యం

- సొంత దారుడి కోసం పోలీసుల గాలింపు

చెన్నై, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): స్థానిక మెరీనా బీచ్‌(Marina Beach)లో లభ్యమైన జర్మన్‌ రివాల్వర్‌ సొంతదారుడిని గుర్తించేదుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మెరీనా బీచ్‌ ఎల్లయమ్మన్‌ ఆలయం వీధిలోని నొచ్చికుప్పం ప్రాంతానికి చెందిన నందగోపాల్‌ అనే జాలరి రోజూ సముద్రతీరంలో గవ్వలను సేకరించేవాడు. అందేవిధంగా మంగళవారం వేకువజాము సముద్రతీరంలోని ఇసుకలో గవ్వలు ఏరుతుండగా ఒకదగ్గర పాతిపెట్టిన రివాల్వర్‌ లభించింది. వెంటనే నందగోపాల్‌ రివాల్వర్‌ను అక్కడే గస్తీ తిరుగుతున్న ఎస్‌ఐ సురేష్‏కు అప్పగించాడు. అది జర్మనీలో తయారైన రివాల్వర్‌(Revolver) అని ఆంగ్లంలో అక్షరాలు ముద్రించి ఉంది. ఆ రివాల్వర్‌ సొంతదారులు దానిని వెతుక్కుంటూ వస్తారని ఎస్‌ఐ సురేష్‌ వేచి చూశాడు. ఎవరూ రాకపోవడంతో రివాల్వర్‌ను మెరీనాబీచ్‌ స్టేషన్‌ ఎస్‌ఐ బాలసుబ్రమణ్యంకు అప్పగించారు. ఆ రివాల్వర్‌లో బుల్లెట్లు లేవని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం రివాల్వర్‌ సొంతదారుడిని కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు.

Updated Date - 2022-10-27T12:55:04+05:30 IST