Aishwarya Rai Bachchan:ఐశ్వర్య‌రాయ్ బచ్చన్ నకిలీ పాస్‌పోర్ట్‌ స్వాధీనం

ABN , First Publish Date - 2022-12-17T09:46:16+05:30 IST

బాలీవుడ్ ప్రముఖ సినీనటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ పేరిట ఉన్న నకిలీ పాస్‌పోర్ట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు....

Aishwarya Rai Bachchan:ఐశ్వర్య‌రాయ్ బచ్చన్ నకిలీ పాస్‌పోర్ట్‌ స్వాధీనం
Aishwarya Rai Fake Passport

లక్నో(ఉత్తరప్రదేశ్) : బాలీవుడ్ ప్రముఖ సినీనటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ పేరిట ఉన్న నకిలీ పాస్‌పోర్ట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.(Aishwarya Rai Bachchan) ఈ కేసులో నిందితులైన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ పాస్‌పోర్ట్‌లో (Fake Passport) ఐశ్వర్య రాయ్ బచ్చన్ చిత్రం ఉంది.గ్రేటర్ నోయిడాలో ఉంటున్న ముగ్గురు విదేశీయులను సైబర్ మోసాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో అరెస్టు చేశామని, వారి వద్ద సినీనటి ఐశ్వర్యారాయ్ బచ్చన్ పేరుతో నకిలీ పాస్‌పోర్ట్(Police Recover Fake Passport) ఉన్నట్లు తేలిందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. తనను రూ.1.81 కోట్ల మేర మోసం చేశారని రిటైర్డ్ ఆర్మీ కల్నల్ చేసిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ కేసులో అరెస్టు అయిన నిందితుల్లో ఇద్దరు నైజీరియాకు చెందినవారు, ఒకరు ఘనాకు చెందినవారు పోలీసులు తెలిపారు.ముఠా నేర కార్యకలాపాలకు వినియోగించే ఆరు మొబైల్ ఫోన్లు, 11 సిమ్ కార్డులు, ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్లు, మరికొన్ని గ్యాడ్జెట్‌లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వివరించారు.నిందితులకు చెందిన మూడు కార్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2022-12-17T09:46:17+05:30 IST