పాతలైన్ల వల్లే విద్యుత ప్రమాదాలు

ABN , First Publish Date - 2022-11-26T23:40:52+05:30 IST

పాతలైన్లు, ప్రకృతి వైపరీత్యాల కారణంగానే విద్యుత ప్రమాదాలు జరుగుతున్నాయని ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ సంతో్‌షరావు తెలిపారు.

పాతలైన్ల వల్లే విద్యుత ప్రమాదాలు

ప్రమాదాల నివారణకు పూర్తి స్థాయిలో పనులు

ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ సంతో్‌షరావు

అనంతపురంరూరల్‌, నవంబరు 26: పాతలైన్లు, ప్రకృతి వైపరీత్యాల కారణంగానే విద్యుత ప్రమాదాలు జరుగుతున్నాయని ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ సంతో్‌షరావు తెలిపారు. శనివారం ట్రాన్సకో సీఎండీ శ్రీధర్‌, ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ సంతో్‌షరావు జిల్లా కేంద్రానికి వచ్చారు. ఈక్రమం లో విద్యుత శాఖ ప్రధాన కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం సంతో్‌షరావు ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. 30ఏళ్ల కిందట ఏర్పాటు చేసిన లైన్లు కావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. గతంలో ఎన్నడు లేనివిధంగా వర్షాలు కురవడంతో కూడా కొంత వరకు ప్రమాదాలు జరిగినట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో విద్యుత ప్రమాదాల నివారణకు 55 ప్రత్యేక బృందాలతో సబ్‌స్టేషన్లు, విద్యుత లైన్లను పరిశీలించినట్లు పేర్కొన్నారు. రోడ్డు క్రాసింగ్‌ వద్ద కొత్త లైన్లు ఏర్పాటును వచ్చే నెల 15లోపు పూర్తి చేయాలని జిల్లా అధికారులను ఆదేశించామన్నారు. వ్యవసాయానికి కోతలు లేకుండా 9గంటల విద్యుత సరఫరాకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఆగస్టు 31లోపు వ్యవసాయ విద్యుత కనెక్షన్లకు దరఖాస్తు చేసుకున్న వారికి ఈనెలాఖరిలోపు కనెక్షన్లు ఇవ్వాలని ఆదేశించామన్నారు. ట్రాన్సకో సీఎండీ శ్రీధర్‌ మాట్లాడుతూ ప్రతి నెలా ప్రతి జిల్లాలో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నామని, ఆ క్రమంలోనే జిల్లాకు వచ్చినట్లు తెలిపారు. అనంతరం ఆలమూరులోని జగనన్న లేఔట్‌లోని విద్యుత లైన్ల ఏర్పాటును పరిశీలించారు. అంతకుముందు ఎస్‌ఈ కార్యాలయంలో అధికారులతో రివ్యూ మీటింగ్‌ నిర్వహించారు. సబ్‌ స్టేషన్ల నిర్వాహణ, అధికారుల తనిఖీలు, లోటుపాట్లపై చర్చించారు. అలాగే రెవెన్యూ కలెక్షన్లు, ట్రాన్స ఫార్మర్స్‌ ఫెయిల్యూర్స్‌, మార్పుచేయట, వ్యవసాయ కనెక్షన్ల మంజూరు తదితర వాటిపై రివ్యూ చేశారు. కార్యక్రమంలో సీజీఎం గురవయ్య, ఏపీఎస్పీడీసీఎల్‌ ఎస్‌ఈ సురేంద్ర, ఈఈటీ రాజశేఖర్‌, ట్రాన్సకో ఎస్‌ఈ ఆనంద్‌, ఈఈలు జేవీ రమేష్‌, భూపతి, సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-26T23:41:00+05:30 IST