ఏపీ విభజన హామీలు నెరవేర్చాలి
ABN , First Publish Date - 2022-11-26T23:49:58+05:30 IST
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంతోపాటు విభజన హామీలు నెరవేర్చాలని ఏఐఎ్‌సఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు.
ఢిల్లీలో విద్యార్థి సంఘాల నేతల నిరసన
అనంతపురం విద్య, నవంబరు 26: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంతోపాటు విభజన హామీలు నెరవేర్చాలని ఏఐఎ్‌సఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. దేశరాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆ సంఘం నాయకులు ధర్నా నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు కుళ్లాయిస్వా మి, ప్రధానకార్యదర్శి చిరంజీవి మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న బీజేపీ ఎన్నికల్లో విజయం తర్వాత దాని ఊసే ఎత్తడం లేదన్నారు. మోదీ ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని మొదలుకుని రాషా్ట్రన్ని పూర్తి గా కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెడుతోందన్నారు. 25 ఎంపీ సీట్లు ఇస్తే మోదీపై పోరాటం చేస్తానన్న జగన్‌మోహన రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట్లాడక పోవడం సిగ్గు చేటన్నారు. విభజనచట్టంలో ఉన్న హామీలను వెంటనే కేంద్రం అమలు చేయాలని కోరారు. అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీకి నిధుల విడుదలలోనూ కేంద్రం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందన్నారు. ఎనిమిదేళ్లు కావస్తున్నా వర్సిటీ ప్రహరీ కూడా పూర్తి చేయలేకపోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు హనుమంతు, రమణయ్య, ఉమా మహేష్, వెంకట్ నాయక్, వినోద్, చంద్ర, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.