ఉపాధ్యాయుడిపై అక్రమ సస్పెన్షన ఎత్తేయాలి

ABN , First Publish Date - 2022-11-26T23:45:25+05:30 IST

యాప్‌లో ముఖ హాజరు నమోదు కాలేదని సమస్యను ప్రస్తావిస్తే ఉపాధ్యాయుడిని సస్పెండ్‌ చేయడం అన్యాయమనీ, వెంటనే ఎత్తేయాలని ఏపీటీఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు.

ఉపాధ్యాయుడిపై అక్రమ సస్పెన్షన ఎత్తేయాలి

ఏపీటీఎఫ్‌ డిమాండ్‌.. ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిక

పుట్టపర్తిరూరల్‌, నవంబరు 26: యాప్‌లో ముఖ హాజరు నమోదు కాలేదని సమస్యను ప్రస్తావిస్తే ఉపాధ్యాయుడిని సస్పెండ్‌ చేయడం అన్యాయమనీ, వెంటనే ఎత్తేయాలని ఏపీటీఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. శనివారం ఏపీటీఎఫ్‌ రాష్ట్ర నేత కోనంకి అశోక్‌కుమార్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆడిట్‌ కన్వీనర్‌ ముత్యాలప్ప, జిల్లా అధ్యక్షుడు కోడూరు శ్రీనివాసులు, గౌరవాధ్యక్షుడు పీవీ మాధవ, జిల్లా సబ్‌ కమిటీ సభ్యులు ఆర్‌ చంద్ర, అంజనమూర్తి.. స్థానిక జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో డీఈఓ మీనాక్షిని కలిసి, వినతి సమర్పించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ.. ఫేషియల్‌ అటెండెన్స యాప్‌లో హాజరు నమోదులో లోపాలను తెలియజేస్తూ ‘గుండు తెచ్చిన తంటా’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ కథనాన్ని ప్రచురించిందన్నారు. దానిని ఆధారంగా చేసుకుని, హిందూపురం మండలం మేళాపురం ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఎల్‌ఎన ఆదినారాయణను సస్పెండ్‌ చేయడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. వెంటనే ఉపాధ్యాయుడిపై అక్రమ సస్పెన్షన ఎత్తివేయాలని డీఈఓను కోరామన్నారు. లేదంటే ఆందోళనలు చేపడతామన్నారు. కార్యక్రమంలో నాయకులు రాందాసునాయక్‌, సాయిశివ, మురళి, కేశవనాయుడు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-26T23:45:26+05:30 IST