Notification: బాలికల సైనిక్ స్కూల్‌లో ప్రవేశాలు
ABN , First Publish Date - 2022-11-10T12:51:37+05:30 IST
కర్ణాటకలోని కిట్టూర్ రాణి చెన్నమ్మ రెసిడెన్షియల్ సైనిక్ స్కూల్ ఫర్ గర్ల్స్(Residential Sainik School for Girls)-ఆరోతరగతిలో ప్రవేశానికి నోటిఫికేషన్(Notification) విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఆసక్తిగల బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చు.
కర్ణాటకలోని కిట్టూర్ రాణి చెన్నమ్మ రెసిడెన్షియల్ సైనిక్ స్కూల్ ఫర్ గర్ల్స్(Residential Sainik School for Girls)-ఆరోతరగతిలో ప్రవేశానికి నోటిఫికేషన్(Notification) విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఆసక్తిగల బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలిండియా ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ ద్వారా అడ్మిషన్ ప్రక్రియ నిర్వహిస్తారు. ఈ స్కూల్‌లో ప్రవేశం పొందిన బాలికలు పన్నెండోతరగతి(సైన్స్ స్ట్రీం) వరకు చదువుకోవచ్చు. సైనిక్/ మిలిటరీ స్కూల్స్ నిబంధనల ప్రకారం సీబీఎ్‌సఈ విధానంలో బోధన ఉంటుంది. ఎన్‌సీసీ ట్రెయినింగ్, గైడ్స్ ఫర్ గర్ల్స్, ఎన్‌డీఏ, కోసం ట్రెయినింగ్‌తోపాటు హార్స్ రైడింగ్, స్విమ్మింగ్, స్పోర్ట్స్ యాక్టివిటీస్, యోగా అండ్ మెడిటేషన్ అంశాల్లో శిక్షణ ఇస్తారు. జేఈఈ/ నీట్ పరీక్షలు రాయాలనుకొనేవారికి సంబంధిత నిపుణులతో కోచింగ్ ఇప్పిస్తారు. యూఎ్‌సఏలోని ఎస్‌వీఎస్‌యూ, సీపీఎస్ సంస్థలతో కుదుర్చుకొన్న త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం అంతర్జాతీయ స్థాయిలో ఎడ్యుకేషన్/ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌లు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు పరస్పరం ఇచ్చిపుచ్చుకునే పద్ధతిలో ఉంటాయి.
అర్హత: విద్యార్థినులు 2011 జూన్ 1 నుంచి 2013 మే 31 మధ్య జన్మించి ఉండాలి. అంటే 2023 జూన్ 1 నాటికి పదేళ్లు నిండి పన్నెండేళ్లలోపు ఉండాలి. గుర్తింపు పొందిన పాఠశాలలో అయిదోతరగతి చదువుతూ ఉండాలి.
అడ్మిషన్ ప్రక్రియ: ఎంట్రెన్స్ ఎగ్జామ్‌ను ఇంగ్లీష్, కన్నడ మాధ్యమాల్లో నిర్వహిస్తారు. విద్యార్థినులు దరఖాస్తులో సూచించిన మాధ్యమంలో మాత్రమే ప్రశ్నపత్రాన్ని ఇస్తారు. ప్రశ్నపత్రంతోపాటే ఆన్సర్ బుక్‌లెట్‌ను ఇస్తారు. పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. ఇందులో లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ కింద ఇంగ్లీష్ నుంచి 25 ప్రశ్నలు, కన్నడ/ హిందీ నుంచి మరో 25 ప్రశ్నలు ఇస్తారు. జనరల్ మేథమెటిక్స్, మెంటల్ ఎబిలిటీ సబ్జెక్ట్‌ల నుంచి ఒక్కోదానిలో 75 ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం రెండు గంటలు. ఆల్ ఇండియా ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్‌లో సాధించిన స్కోర్ ఆధారంగా ఇంటర్వ్యూ, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి అర్హులకు అడ్మిషన్స్ ఇస్తారు.
ముఖ్య సమాచారం
స్కూలు వార్షిక ఫీజు: రూ.1,98,900
దరఖాస్తు ఫీజు: జనరల్ కేటగిరీ విద్యార్థినులకు రూ.2,000; ఎస్సీ, ఎస్టీ విద్యార్థినులకు రూ.1600
దరఖాస్తు చేరేందుకు చివరి తేదీ: డిసెంబరు 26
హాల్ టికెట్‌ను పోస్ట్ ద్వారా పంపుతారు.
పరీక్ష కేంద్రాలు: కిట్టూర్, విజయపూర్, బెంగళూరు, కలబురగి
ఆలిండియా ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ తేదీ: 2023 జనవరి 22
దరఖాస్తు పంపాల్సిన చిరునామా: ద ప్రిన్సిపల్, కిట్టూర్ రాణి చెన్మమ్మ రెసిడెన్షియల్ సైనిక్ స్కూల్ ఫర్ గర్ల్స్, కిట్టూర్- 591115, బెలగావీ డిస్ట్రిక్ట్, కర్ణాటక.
వెబ్‌సైట్: www.kittursainikschool.in