పెండెకంటి లా కాలేజ్‌లో LLB, LLM

ABN , First Publish Date - 2022-11-09T16:17:20+05:30 IST

హైదరాబాద్‌లోని పెండెకంటి లా కాలేజ్‌(Pendecanti Law College) - మూడేళ్లు/ అయిదేళ్ల ఎల్‌ఎల్‌బీ(LLB), రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం(LLM)(కార్పొరేట్‌ లా) ప్రోగ్రామ్‌లలో బీ కేటగిరీ సీట్ల భర్తీకి దరఖాస్తులు

పెండెకంటి లా కాలేజ్‌లో LLB, LLM
లా కాలేజ్‌లో LLB, LLM

హైదరాబాద్‌లోని పెండెకంటి లా కాలేజ్‌(Pendecanti Law College) - మూడేళ్లు/ అయిదేళ్ల ఎల్‌ఎల్‌బీ(LLB), రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం(LLM)(కార్పొరేట్‌ లా) ప్రోగ్రామ్‌లలో బీ కేటగిరీ సీట్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

బీ కేటగిరీ సీట్ల వివరాలు: మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ ప్రోగ్రామ్‌లో 48 సీట్లు, అయిదేళ్ల ఎల్‌ఎల్‌బీ ప్రోగ్రామ్‌లో 12 సీట్లు, ఎల్‌ఎల్‌ఎం (కార్పొరేట్‌ లా) ప్రోగ్రామ్‌లో 4 సీట్లు ఉన్నాయి.

అర్హత: మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి ఏదేని డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు లాసెట్‌ అర్హత పొంది ఉండాలి. అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎల్‌ఎల్‌బీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి ఇంటర్‌/ పన్నెండోతరగతి/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణతతోపాటు లాసెట్‌ అర్హత పొంది ఉండాలి. ఎల్‌ఎల్‌ఎం ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి పీజీఎల్‌సెట్‌ అర్హత పొంది ఉండాలి.

ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: రూ.1000

పోస్ట్‌ద్వారా దరఖాస్తు చేరేందుకు చివరి తేదీ: నవంబరు 14

చిరునామా: పెండెకంటి లా కాలేజ్‌, 1 - 1 - 338, స్ట్రీట్‌ నెం. 6, వివేక్‌నగర్‌, చిక్కడపల్లి, హైదరాబాద్‌ - 500020

వెబ్‌సైట్‌: www.plchyd.ac.in

Updated Date - 2022-11-09T16:17:22+05:30 IST