TSPSC Exams Special: భారత రాజ్యాంగం రాజకీయ వ్యవస్థ
ABN , First Publish Date - 2022-11-16T13:13:28+05:30 IST
జాతీయ అధికార భాషలో చేసే మార్పు చేర్పులకు సంబంధించిన బిల్లులు.
టీఎస్‌పీఎస్సీ పరీక్షల ప్రత్యేకం
రాష్ట్రపతి
రాష్ట్రపతి పూర్వానుమతితో ప్రవేశపెట్టాల్సిన బిల్లులు
ఆర్టికల్-3: కొత్త రాష్ట్రాల ఏర్పాటు, రాష్ట్రాల విస్తీర్ణం, సరిహద్దులను, పేర్లను మార్చడానికి సంబంధించిన బిల్లులు.
ఆర్టికల్-109: అనుసరించి ప్రవేశపెట్టే ద్రవ్య బిల్లులు.
ఆర్టికల్-112: ప్రకారం ప్రవేశపెట్టే బడ్జెట్
ఆర్టికల్-117(1): ప్రకారం ప్రవేశపెట్టే ఆర్ధిక బిల్లులు
ఆర్టికల్-31(ఎ): ఆస్తుల జాతీయీకరణ బిల్లులు. రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ ఆదాయంపై పన్నులు విధించే అవకాశం ఉన్న బిల్లులు.
ఆర్టికల్-19(1)(జి): వ్యాపార, వాణిజ్య స్వేచ్ఛను నియంత్రించే రాష్ట్రాల బిల్లులు.
ఆర్టికల్-349: జాతీయ అధికార భాషలో చేసే మార్పు చేర్పులకు సంబంధించిన బిల్లులు.
ఆర్థిక అధికారాలు
ఆర్టికల్-110: ఆర్థిక బిల్లును రాష్ట్రపతి పూర్వానుమతితో మాత్రమే పార్లమెంటులో ప్రవేశపెట్టాలి.
ఆర్టికల్-112: వార్షిక ఆదాయ, వ్యయాల అంచనా పట్టిక(బడ్జెట్)ను పార్లమెంటులో ప్రవేశపెట్టే బాధ్యత రాష్ట్రపతికి ఉంటుంది.
ఆర్టికల్-267: భారత ఆగంతుక నిధికి సంబంధించిన లావాదేవీలు రాష్ట్రపతి నిర్వహిస్తాడు.
ఆర్టికల్-280: ప్రతి అయిదు సంవత్సరాలకు ఒకసారి ఆర్ధిక సంఘాన్ని రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు.
ఆర్టికల్-151: కాగ్, కేంద్రప్రభుత్వ ఖర్చులు, ఖాతాలకు సంబంధించిన నివేదికను రాష్ట్రపతికి సమర్పించగా ఆయన దానిని పార్లమెంటు ముందు ఉంచుతారు. ఆర్థిక సంఘం నివేదికను, కాగ్ వార్షిక నివేదికను పార్లమెంటు ఆమోదానికి రాష్ట్రపతే ప్రవేశపెడతారు.
గమనిక: 1) విదేశీ రుణాలను సేకించేటప్పుడు రాష్ట్రపతి అనుమతి తప్పనిసరి. 2) నూతన పన్నులు, కొత్త అప్పులకు రాష్ట్రపతి అనుమతి తప్పనిసరి.
న్యాయ అధికారాలు
ఆర్టికల్-124: సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమిస్తారు.
ఆర్టికల్-217: హైకోర్టు న్యాయమూర్తులను నియమిస్తారు.
ఆర్టికల్-143: రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహా కోరతారు.
ఆర్టికల్-72: క్షమాభిక్ష అధికారాన్ని కలిగి ఉంటారు. రాష్ట్రపతి సుప్రీంకోర్టు, కోర్టు మార్షల్(సైనిక న్యాయస్థానాలు విధించే శిక్షలు) సహా దేశంలో ఏ న్యాయస్థానం విధించిన, ఏ శిక్షకు అయినా క్షమాభిక్ష పెట్టే అధికారాన్ని కలిగి ఉంటారు. రాష్ట్రపతికి క్షమాభిక్ష అధికారాన్ని కల్పించడంలో రాజ్యాంగం కింది అంశాలకు ప్రాధాన్యం ఇస్తుంది.
-వి.చైతన్యదేవ్
పోటీ పరీక్షల నిపుణులు