Andhra Universityలో డబుల్ డిగ్రీ
ABN , First Publish Date - 2022-09-17T21:56:49+05:30 IST
విశాఖపట్నం(Visakhapatnam)లోని ఆంధ్ర యూనివర్సిటీ(Andhra University) - ‘బీఎస్సీ ఆనర్స్ + ఎమ్మెస్సీ ఇన్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ’ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు

విశాఖపట్నం (Visakhapatnam)లోని ఆంధ్ర యూనివర్సిటీ(Andhra University) - ‘బీఎస్సీ ఆనర్స్ + ఎమ్మెస్సీ ఇన్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ’ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. బీఎస్సీ ఆనర్స్ వ్యవధి నాలుగేళ్లు. ఎమ్మెస్సీ వ్యవధి ఏడాది. మొత్తం ప్రోగ్రామ్ వ్యవధి అయిదేళ్లు. ఏడాదికి రెండు చొప్పున మొత్తం పది సెమిస్టర్లు ఉంటాయి. ఏటా నిర్దేశిత సెమిస్టర్లు పూర్తిచేసి ప్రోగ్రామ్ నుంచి వైదొలగే వీలుంది. మొదటి ఏడాది పూర్తయ్యాక సర్టిఫికెట్, రెండో ఏడాది పూర్తయ్యాక డిప్లొమా, మూడో ఏడాది పూర్తయ్యాక బ్యాచిలర్ డిగ్రీ, నాలుగో ఏడాది పూర్తయ్యాక ఆనర్స్ డిగ్రీ, అయిదో ఏడాది పూర్తయ్యాక మాస్టర్స్ డిగ్రీ పొందవచ్చు. ఈ ప్రోగ్రామ్‌లో మొత్తం 44 సీట్లు ఉన్నాయి. అకడమిక్ మెరిట్ ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహించి అర్హులకు అడ్మిషన్స్ ఇస్తారు.
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మేథమెటిక్స్/ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్ట్‌లుగా ఇంటర్/ పన్నెండో తరగతి/ తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. జనరల్ అభ్యర్థులకు కనీసం 50 శాతం మార్కులు; రిజర్వ్డ్ అభ్యర్థులకు కనీసం 45 శాతం మార్కులు తప్పనిసరి.
ముఖ్య సమాచారం
దరఖాస్తు ఫీజు: రూ.2,000
కౌన్సెలింగ్ ఫీజు: రూ.600
పోస్ట్ ద్వారా/ స్వయంగా దరఖాస్తు సబ్మిషన్కు చివరి తేదీ: సెప్టెంబరు 24
కౌన్సెలింగ్ తేదీ: సెప్టెంబరు 26
చిరునామా: డైరెక్టర్, డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్, ఆంధ్ర యూనివర్సిటీ, విజయనగర్ పాలెస్, పెద వాల్తేర్, విశాఖపట్నం - 530017
వెబ్సైట్: www. audoa.in