Shipyard: కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో జీఎంఈ ట్రెయినింగ్‌

ABN , First Publish Date - 2022-11-15T16:19:20+05:30 IST

కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ (Cochin Shipyard Ltd) ఆధ్వర్యంలోని మెరైన్‌ ఇంజనీరింగ్‌ ట్రెయినింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (Marine Engineering Training Institute) (ఎంఈటీఐ) - గ్రాడ్యుయేట్‌ మెరైన్‌ ఇంజనీరింగ్‌ కోర్సులో ప్రవేశానికి

Shipyard: కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో జీఎంఈ ట్రెయినింగ్‌
జీఎంఈ ట్రెయినింగ్‌

కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ (Cochin Shipyard Ltd) ఆధ్వర్యంలోని మెరైన్‌ ఇంజనీరింగ్‌ ట్రెయినింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (Marine Engineering Training Institute) (ఎంఈటీఐ) - గ్రాడ్యుయేట్‌ మెరైన్‌ ఇంజనీరింగ్‌ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఇది 12 నెలల వ్యవధి గల రెసిడెన్షియల్‌ కోర్సు. ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుంది. ప్రోగ్రామ్‌లో భాగంగా క్లాస్‌ రూం ఇన్‌స్ట్రక్షన్స్‌, ల్యాబొరేటరీ వర్క్‌లు, వర్క్‌షాప్‌ ప్రాక్టీ‌స్‌లు, రిటెన్‌ టెస్ట్‌లు, ప్రాక్టికల్‌ టెస్ట్‌లు, ఫ్లోట్‌ ట్రెయినింగ్‌ ఉంటాయి. అభ్యర్థులు ట్రెయినింగ్‌ మాన్యువల్‌, వర్క్‌ డైరీలను మెయింటైన్‌ చేయాల్సి ఉంటుంది. మొత్తం 114 సీట్లు ఉన్నాయి. ఈ కోర్సుకు డైరెక్టరేట్‌ జనరల్‌ షిప్పింగ్‌ (డీజీఎస్‌) గుర్తింపు ఉంది. స్టయిపెండ్‌ సౌకర్యం లేదు.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50 శాతం మార్కులతో మెకానికల్‌/ మెరైన్‌/ నేవల్‌ ఆర్కిటెక్చర్‌ విభాగాల్లో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణులై ఉండాలి. మెకానికల్‌/ నేవల్‌ ఆర్కిటెక్చర్‌ ప్రధాన సబ్జెక్ట్‌లుగా ఇతర విభాగాల్లో డిగ్రీ చేసినవారు కూడా అర్హులే. పదోతరగతి/ ఇంటర్‌/ డిప్లొమా/ డిగ్రీ స్థాయిలో ఇంగ్లీష్‌ సబ్జెక్ట్‌లో కనీసం 50 శాతం మార్కులు తప్పనిసరి. అభ్యర్థుల వయసు 2023 జనవరి 1 నాటికి 28 ఏళ్లు మించకూడదు. డీజీఎస్‌ నిబంధనల ప్రకారం శారీరక ప్రమాణాలు, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ ఉండాలి. అడ్మిషన్‌ నాటికి అభ్యర్థులందరూ పాస్‌పోర్ట్‌ సిద్దం చేసుకోవాలి.

ముఖ్య సమాచారం

దరఖాస్తు సబ్మిషన్‌కు చివరి తేదీ: డిసెంబరు 15

ఈ మెయిల్‌: metihod@cochinshipyard.in

వెబ్‌సైట్‌: www.cochinshipyard.in

Updated Date - 2022-11-15T16:19:21+05:30 IST