education loans: విదేశీ విద్యా రుణాల్లో గేమ్ చేంజర్స్ లోన్-బిడ్డింగ్ ప్లాట్‌ఫామ్స్
ABN , First Publish Date - 2022-12-05T15:52:25+05:30 IST
‘‘జ్ఞానం మీద పెట్టే పెట్టుబడికి లాభం ఎక్కువ’’ అమెరికన్ శాస్త్రవేత్త బెంజమిన్ ఫ్రాంక్లిన్ మాట. ‘యునైటెడ్ స్టేట్స్ డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్’ ముసాయిదా రచయితగానూ
‘‘జ్ఞానం మీద పెట్టే పెట్టుబడికి లాభం ఎక్కువ’’ అమెరికన్ శాస్త్రవేత్త బెంజమిన్ ఫ్రాంక్లిన్ మాట. ‘యునైటెడ్ స్టేట్స్ డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్’ ముసాయిదా రచయితగానూ ఈయన పేరొందారు. విదేశీ విశ్వవిద్యాలయాల్లో పోస్ట్‌గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరడానికి భారత విద్యార్థులు ఎక్కువ మంది దరఖాస్తు చేయడాన్ని గమనిస్తే ఈ కోట్ గుర్తుకు రాకమానదు. 2024 నాటికి విదేశాల్లో ఉన్నత విద్య కోసం దరఖాస్తు చేసుకునే భారతీయ విద్యార్థుల సంఖ్య 18 లక్షలకు చేరుకుంటుందన్నది ప్రముఖ పరిశోధన, సలహా సంస్థ ‘రెడ్‌సీర్’ అంచనా. అసలీ విషయాన్ని లోతుగా చూసినప్పుడు....
ప్రపంచీకరణ విద్యావకాశాలను విస్తృతపర్చినమాట నిజం. అయితే భారీ ఫీజులతోపాటు, ఆర్థిక పరిమితులు విద్యార్థుల కలలకు గండికొడుతున్నాయి. విదేశాల్లో చదువుకునేందుకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ 65 శాతం మంది భారత విద్యార్థులు, కేవలం ఆర్థిక పరిస్థితులు సజావుగా లేనందున సదరు అవకాశాన్ని చేజార్చుకుంటున్నారు. విదేశీ విశ్వవిద్యాలయాలు వసూలు చేసే రుసుములు సహా యావత్తు వ్యయం కొన్ని సందర్భాల్లో అస్సలు భరించలేనిదిగా ఉంది. ట్యూషన్ ఫీజు, నివాసం, భోజనం అన్నీ కలిపి విదేశాల్లో పీజీ చేయాలంటే సుమారు 40 లక్షల నుంచి కోటి రూపాయలు మధ్య వ్యయం అవుతోంది. అయితే చాలా సందర్భాల్లో కౌన్సెలింగ్‌తో మొదలుపెట్టి మొత్తం ప్రక్రియ కోసం లేదా అందులోనూ నిర్దుష్టంగా ఒక ప్రోగ్రామ్ కోసం రుణం అడిగితే ఎవరూ ముందుకు రావడం లేదన్నది కఠిన వాస్తవం.
2001లో ప్రారంభమైన ఎడ్యులోన్స్: ఇలాంటి పరిస్థితుల్లో విద్యా రుణం(ఎడ్యుకేషన్ లోన్) అనేది నిజంగా ఒక వరం. విద్యా రుణాలను ప్రోత్సహించాలనే ఆలోచనను ‘ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్’ తొలుత ప్రస్తావించింది. కార్యాచరణలో భాగంగా 2001లో విద్యార్థులకు రుణ పథకాన్ని మొదట రూపొందించింది. అప్పటి నుంచి దేశంలోని వివిధ బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు విద్యా రుణాలకు శ్రీకారం చుట్టాయి. విచిత్రం ఏమంటే ఈ రుణ సదుపాయాలన్నీ ఎక్కువగా నగరాల్లోని విద్యార్థులకే పరిమితమయ్యాయి. టూటైర్, త్రీ టైర్ పట్టణాల్లోని విద్యార్థులకు అందుబాటు తక్కువ. సంబంధిత సమాచారం కూడా ఈ విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు తెలియడం లేదు. ఫలితంగా రుణం దిశగా ప్రయత్నాలే ముందుకు కదలడం లేదు. మరోవైపు దరఖాస్తులు పెరుగుతున్నాయి.
ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌ను తీసుకుంటే గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది విద్యార్థుల రుణ దరఖాస్తులు మూడు రెట్లు పెరిగాయి. అలాగే విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు వంటి జిల్లాలు రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉన్నాయి. మూడేళ్ల క్రితం వరకు ఈ పరిస్థితి లేదు. కొవిడ్ తరవాత ఇండియాలోని ఒక రాష్ట్రం వ్యవహారం మాత్రమే ఇది. మన దేశంలో విదేశీ విద్యపై పెరుగుతున్న మోజుకు ఇదో ఉదాహరణ.
న్యూ ప్లేయర్స్: ఈ పరిస్థితుల్లోనే బ్యాంక్‌లోన్లకు ప్రత్యామ్నాయంగా లోన్-బిడ్డింగ్ ప్లాట్‌ఫామ్‌లు గేమ్ ఛేంజర్‌లుగా మారుతున్నాయి. ఈ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో దేశీయ, అంతర్జాతీయ రుణదాతలను భాగస్వామ్యం చేస్తారు. తద్వారా రుణ దరఖాస్తు ప్రక్రియను వేగవంతం చేయడంలో అవి విద్యార్థులకు సహాయపడుతున్నాయి. అలా విదేశాల్లో చదువుకునేందుకు తోడ్పాటును అందిస్తున్నాయి.
లోన్‌బిడ్డింగ్ ప్లాట్‌ఫామ్స్ ఒకరకంగా ఆల్ ఇన్ వన్ మాదిరిగా తోడ్పడతాయి. ఈ సంస్థలకు చెందిన యాప్ లేదంటే వెబ్‌సైట్‌లు నేరుగా సహాయపడతాయి. ఈ సంస్థలు ఎక్కువగా బ్యాంకులు సహా ఇతర రుణ సంస్థలతో టైఅప్ అయి ఉంటాయి. వాటిలోకి వెళ్ళి పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవాలి. అలా దరఖాస్తు పెట్టిన వెంటనే, అవి స్పందిస్తాయి. తాము ఎంత రుణం ఇస్తాం, వడ్డీ రేటు ఎంత, అందుకు పాటించాల్సిన నిబంధనలు ఏమిటి వంటి వివరాలతో వేటికవి తెలుపుతాయి. దీన్నే బిడ్డింగ్ అంటారు. వాటిలో ఏ ఆఫర్ బాగుంటే దాని వైపు విద్యార్థి మొగ్గు చూపవచ్చు. రుణం కోసం విద్యార్థులు నేరుగా ఏ బ్రాంచ్‌ను సందర్శించాల్సిన అవసరం ఉండదు. దేశంలో ఎక్కడి నుంచైనా తమ రుణ దరఖాస్తులను ఫైల్ చేసుకునే వీలును కల్పిస్తున్నాయి. రుణాన్ని అందుకునే విషయంలో యావత్తు ప్రక్రియను సులభతరం చేస్తున్నాయి.
వినియోగదారు ప్లాట్‌ఫామ్‌లో నమోదు చేసుకున్న తరవాత, అవసరాలను బట్టి వివిధ రుణ పథకాలను అందించడానికి బ్యాంకులు ముందుకు వస్తాయి. అదేవిధంగా తమ పోటీ రుణ సంస్థలు ఎలాంటి ప్రాడక్ట్‌లను అందిస్తున్నాయో కూడా తెలుసుకునే అవకాశం ఈ ప్లాట్‌ఫారాల్లో ఉంటుంది. మొత్తం వ్యవహారం పారదర్శకంగా ఉంటుంది. రుణాలను అందించే పోటీదారులు ఎవరు అనేది తెలుకునేందుకే ఇవి పరిమితం కావు. విద్యార్థులకు రుణం పొందేందుకు అవసరమైన కేంద్రీకృత కేంద్రాలుగా పనిచేస్తాయి. ఒక రకంగా సరైన రుణం అందుకునేవరకు తోడ్పడతాయి. అగ్రిగేటర్ అంటే సంబంధిత లింకులతో సమస్త సమాచారం అందించడానికే పరిమితం కావు. సంప్రదాయ సంస్థల మాదిరిగా కాకుండా విద్యార్థి నిర్దేశిత కేంద్రాలుగా పనిచేస్తాయి.
విద్యార్థుల భిన్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎవరికి వారుగా అనుకూలించిన పరిష్కారాలను అందిస్తాయి. ఎంపిక ప్రక్రియ ప్రారంభంలోనే విద్యార్థులకు బ్యాంకులు రుణాలను అందించే కళాశాలలు తెలియజేస్తాయి. తద్వారా వారు చివరి నిమిషం వరకు తడబడే పరిస్థితి లేదంటే సమయాన్ని వృథా చేయకుండా ఉండటానికి కూడా తోడ్పడతాయి. విద్యార్థి అవసరాలకు తగ్గట్టు బ్యాంకులు రుణాలు ఇవ్వనిపక్షంలో ప్రత్యామ్నాయాలను పరిశీలించడానికి వీలు కల్పిస్తుంది. దీనికి తోడు పీజీ కోసం కౌన్సెలర్లు, మెంటార్ల మార్గదర్శకత్వం కూడా ఉంటుంది.
ఈ వెబ్‌సైట్స్‌లో లోన్-దరఖాస్తు ప్రక్రియలో వారు ఎక్కడ ఉన్నారో ఎప్పటికప్పుడు తెలుసుకోగలుగుతారు. ఈ లైవ్ స్టేటస్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇచ్చిన గడువులోపు విశ్వవిద్యాలయాల్లో తమ సీట్లను రిజర్వ్ చేసుకోవడానికి తోడు సకాలంలో రుణాన్ని పొం దడం విద్యార్థులకు అవసరం. అది ఈ ప్లాట్‌ఫామ్స్‌లో సక్రమంగా జరుగుతుంది. ఉదాహరణకు మా గ్రాడ్‌రైట్ వెబ్‌సైట్ లేదంటే యాప్‌లో దరఖాస్తు చేసుకున్న పది నిమిషాల్లోనే బిడ్స్ వచ్చేస్తాయి. ఎంచుకున్న ఆఫర్‌కు అనుగుణంగా డాక్యుమెంట్లను అం దించగలిగితే 48 గంటలు అంటే కేవలం రెం డు రోజుల్లో రుణ సదుపాయాన్ని పొందవచ్చు.
- శివాని మణి, లీడ్- స్టూడెంట్ ఫైనాన్సింగ్ సక్సెస్ గ్రాడ్‌రైట్
మా వివరాలు
Download the free app: https://play.google.com/-store/apps/details?id=com.
gradright.app & pli=1Log on: https://gradright.com
Email: grad@gradright.com
Call: 08047249992