Madurai Kamaraj Universityలో ప్రోగ్రామ్‌లు

ABN , First Publish Date - 2022-07-06T20:59:01+05:30 IST

మధురై కామరాజ్‌ యూనివర్సిటీ(Madurai Kamaraj University) - పీజీ, పీజీ డిప్లొమా, డిగ్రీ, హయ్యర్‌ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికెట్‌, ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌(Integrated program)లలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

Madurai Kamaraj Universityలో ప్రోగ్రామ్‌లు

మధురై కామరాజ్‌ యూనివర్సిటీ(Madurai Kamaraj University) - పీజీ, పీజీ డిప్లొమా, డిగ్రీ, హయ్యర్‌ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికెట్‌, ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌(Integrated program)లలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. 


పీజీ: ప్రోగ్రామ్‌ వ్యవధి రెండేళ్లు. ఇందులో ఎంట్రెన్స్‌, నాన్‌ ఎంట్రెన్స్‌ ప్రోగ్రామ్‌లు ఉన్నాయి. 

ఎంట్రెన్స్‌ ప్రోగ్రామ్‌లు: వీటికి ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ ద్వారా అడ్మిషన్స్‌ ఇస్తారు.  ఎమ్మెస్సీ(బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, కంప్యూటర్‌ సైన్స్‌ విత్‌ స్పెషలైజేషన్‌ ఇన్‌ డేటా అనలిటిక్స్‌, క్రిమినాలజీ అండ్‌ క్రిమినల్‌ జస్టిస్‌, ఎర్త్‌ రిమోట్‌ సెన్సింగ్‌ అండ్‌ జియో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, జినోమిక్స్‌, జాగ్రఫీ, మెరైన్‌ బయాలజీ, మేథమెటిక్స్‌, మైక్రోబయల్‌ జీన్‌ టెక్నాలజీ, మైక్రో బయాలజీ, ఫిజిక్స్‌), ఎంబీఏ(హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌, రెసిడెన్షియల్‌ ప్రోగ్రామ్‌), ఎంసీఏ, ఎంఏ(ఇంగ్లీష్‌, ఫ్రెంచ్‌, తమి ళం), ఎంఈడీ, ఎంపీఈడీ ప్రోగ్రామ్‌లు ఉన్నాయి.

నాన్‌ ఎంట్రెన్స్‌ ప్రోగ్రామ్‌లు: వీటికి ఎంట్రెన్స్‌ రాయనవసరం లేదు. ఎమ్మెస్సీ(ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్సెస్‌, ఫిల్మ్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ మీడియా స్టడీస్‌, మేథమెటికల్‌ ఎకనామిక్స్‌, సైకాలజీ, విజువల్‌ కమ్యూనికేషన్‌), ఎంబీఏ (టూరిజం అండ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌), ఎంకాం, ఎంఏ(అడ్మినిస్ట్రేటివ్‌ స్డడీస్‌, ఎకనామిక్స్‌, ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ స్టడీస్‌, హిస్టరీ, జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌, కన్నడం, లింగ్విస్టిక్స్‌, మలయాళం లాంగ్వేజ్‌ అండ్‌ లిటరేచర్‌, ఫిలాసఫీ అండ్‌ రెలీజియన్‌, పొలిటికల్‌ సైన్స్‌, సంస్కృతం, సోషియాలజీ, తెలుగు, ఉమెన్స్‌ స్టడీస్‌), ఎం లైబ్రరీ సైన్స్‌ ప్రోగ్రామ్‌లు ఉన్నాయి.

డిగ్రీ: ప్రోగ్రామ్‌ వ్యవధి మూడేళ్లు. బీఎస్సీ (మేథమెటిక్స్‌, సైకాలజీ), బీఏ(ఇంగ్లీష్‌, తమిళం), బీకాం, బీబీఏ, బ్యాచిలర్‌ ఆఫ్‌ ఒకేషనల్‌ (అగ్రికల్చర్‌/ సస్టయినబుల్‌) ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. 

ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌: ప్రోగ్రామ్‌ వ్యవధి అయిదేళ్లు. ఎంబీఏ(టూరిజం అండ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌) ప్రోగ్రామ్‌ ఉంది. 

సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌లు: క్రిస్టియానిటీ, ఫ్రెంచ్‌, జియో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, లింగ్విస్టిక్స్‌, మలయాళం, సంస్కృతం, తెలుగు సబ్జెక్ట్‌లు అందుబాటులో ఉన్నాయి.

డిప్లొమాలు: క్రిస్టియానిటీ, ఫ్రెంచ్‌, లింగ్విస్టిక్స్‌, మలయాళం, తెలుగు స్పెషలైజేషన్‌లు ఉన్నాయి.

హయ్యర్‌ డిప్లొమా: ఫ్రెంచ్‌ సబ్జెక్ట్‌ అందుబాటులో ఉంది

పీజీ డిప్లొమా: ఇండస్ట్రియల్‌ మెటల్‌ ఫినిషింగ్‌, సైంటిఫిక్‌ యోగా, మెడిటేషన్‌ అండ్‌ హాలిస్టిక్‌ హెల్త్‌, శైవ సిద్దార్థ ఫిలాసఫీ, జీఐఎస్‌ అండ్‌ రిమోట్‌ సెన్సింగ్‌ అప్లికేషన్స్‌ స్పెషలైజేషన్‌లు ఉన్నాయి.  


ముఖ్య సమాచారం

దరఖాస్తు సబ్మిషన్‌కు చివరి తేదీ: జూలై 7 

పీజీ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌: జూలై 17

వెబ్‌సైట్‌: www.mkuniversity.ac.in

Updated Date - 2022-07-06T20:59:01+05:30 IST