Law: నల్సార్‌ యూనివర్సిటీలో ఎంబీఏ

ABN , First Publish Date - 2022-11-14T14:47:20+05:30 IST

హైదరాబాద్‌లోని నల్సార్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లా(Nalsar University of Law)కు చెందిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ - ఎంబీఏ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ప్రోగ్రామ్‌ వ్యవధి రెండేళ్లు. మొత్తం 66 సీట్లు ఉన్నాయి

Law: నల్సార్‌ యూనివర్సిటీలో ఎంబీఏ
ఎంబీఏ

హైదరాబాద్‌లోని నల్సార్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లా(Nalsar University of Law)కు చెందిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ - ఎంబీఏ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ప్రోగ్రామ్‌ వ్యవధి రెండేళ్లు. మొత్తం 66 సీట్లు ఉన్నాయి. వీటిలో 16 సీట్లను తెలంగాణ అభ్యర్థుల కోసం ప్రత్యేకించారు. మిగిలిన 50 సీట్లకు దేశవ్యాప్తంగా అభ్యర్థులు పోటీపడవచ్చు. జనరల్‌ కేటగిరీలో మరో ముగ్గురికి అవకాశం కల్పిస్తారు. విదేశీ విద్యార్థులకోసం అదనంగా 13 సీట్లు కేటాయించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్‌లు వర్తిస్తాయి.

స్పెషలైజేషన్‌లు: కార్పొరేట్‌ గవర్నెన్స్‌, కోర్ట్‌ మేనేజ్‌మెంట్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అండ్‌ కేపిటల్‌ మార్కెట్స్‌, ఇన్నోవేషన్‌ అండ్‌ సస్టయినబిలిటీ మేనేజ్‌మెంట్‌, బిజినెస్‌ అనలిటిక్స్‌, ఆపరేషన్స్‌ అండ్‌ సిస్టమ్స్‌ మేనేజ్‌మెంట్‌, మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్‌, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌, బిజినెస్‌ రెగ్యులేషన్స్‌

ప్రోగ్రామ్‌ వివరాలు: ఏడాదికి మూడు చొప్పున మొత్తం ఆరు టర్మ్‌లు ఉంటాయి. వీటిలో కోర్‌ కోర్సులు, ఎలక్టివ్‌ కోర్సులు చదవాల్సి ఉంటుంది. ఒక సెమినార్‌ కోర్సు, మాస్టర్స్‌ లెవెల్‌ డిజర్టేషన్‌, మూడు ఇంటర్న్‌షి్‌పలు పూర్తిచేయాల్సి ఉంటుంది. ప్రోగ్రామ్‌ మొత్తమ్మీద 130 క్రెడిట్స్‌ ఉంటాయి. ఒక్కో క్రెడిట్‌కు పదిన్నర గంటల టీచింగ్‌/ కాంటాక్ట్‌ సెషన్స్‌ కేటాయించారు.

  • ఈ ప్రోగ్రామ్‌లో ప్రధానంగా అడ్వాన్స్‌డ్‌ స్టాటిస్టిక్స్‌, బిజినెస్‌ కమ్యూనికేషన్‌, అకౌంటింగ్‌, ఆర్గనైజేషనల్‌ బిహేవియర్‌, మేనేజీరియల్‌ ఎకనామిక్స్‌, మేనేజీరియల్‌ కంప్యూటింగ్‌, మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్‌, బిజినెస్‌ రిసెర్చ్‌ మెథడ్స్‌, ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌, బిజినెస్‌ ఎన్విరాన్‌మెంట్‌, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌, ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌, స్ట్రాటజిక్‌ మేనేజ్‌మెంట్‌, బిజినెస్‌ లాస్‌, గేమ్‌ థియరీ వంటి కోర్‌ కోర్సులు; లేబర్‌ లాస్‌, రిటైల్‌ మేనేజ్‌మెంట్‌, కార్పొరేట్‌ ట్యాక్సేషన్‌, ఆర్‌ అండ్‌ పైథాన్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, సెక్రటేరియల్‌ ప్రాక్టీస్‌, సెబీ రెగ్యులేషన్స్‌, బిగ్‌ డేటా అండ్‌ డేటా మైనింగ్‌, కార్పొరేట్‌ క్రైమ్స్‌, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్‌, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌, సేల్స్‌ అండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ మార్కెటింగ్‌ తదితర ఎలక్టివ్‌ కోర్సులు ఉంటాయి.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ద్వితీయ శ్రేణి మార్కులతో ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా అర్హులే. క్యాట్‌ 2022లో 70 శాతానికి మించిన స్కోర్‌ ఉండాలి. లేదంటే నల్సార్‌ మేనేజ్‌మెంట్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(ఎన్‌-మెట్‌ పీజీ) రాయాల్సి ఉంటుంది.

ఎన్‌ - మెట్‌ పీజీ వివరాలు: క్యాట్‌ సిలబస్‌ ఆధారంగా పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో రెండు సెక్షన్‌లు ఉంటాయి. సెక్షన్‌కు 50 మార్కులు నిర్దేశించారు. మొదటి సెక్షన్‌లో వెర్బల్‌ ఎబిలిటీ, లాజికల్‌ రీజనింగ్‌; రెండో సెక్షన్‌లో క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ, డేటా ఇంట్రప్రిటేషన్‌ నుంచి ఒక్కోదానిలో 25 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు అడుగుతారు. రుణాత్మక మార్కులు లేవు.

ఎంపిక: ఎన్‌-మెట్‌ పీజీ స్కోర్‌/క్యాట్‌ 2022 స్కోర్‌, అకడమిక్‌ ప్రతిభ, ప్రొఫెషనల్‌గా సాధించిన విజయాలు, గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇండస్ట్రీ స్పాన్సర్డ్‌, విదేశీ విద్యార్థులకు ఎటువంటి స్కోర్‌ అవసరం లేదు. వీరికి అకడమిక్‌ ప్రతిభ, అనుభవం, స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌, టెలిఫోనిక్‌ ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.

ముఖ్య సమాచారం

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 2023 ఫిబ్రవరి 16

ఎన్‌-మెట్‌ - పీజీ తేదీ: 2023 ఫిబ్రవరి 19

దరఖాస్తుకు జతచేయాల్సిన పత్రాల కాపీలు: పదోతరగతి సర్టిఫికెట్‌, డిగ్రీ సర్టిఫికెట్‌, మార్కుల పత్రాలు; జాతీయ పరీక్ష స్కోర్‌ కార్డ్‌; కులం, వైకల్యం సంబంధిత పత్రాలు; ఆధార్‌ కార్డ్‌/ పాన్‌ కార్డ్‌/ ఓటర్‌ ఐడీ; ఎక్స్‌పీరియెన్స్‌ సర్టిఫికెట్‌, ఇండస్ట్రీ ఎండార్స్‌మెంట్‌; విదేశీ విద్యార్థులైతే పాస్‌పోర్ట్‌.

చిరునామా: రిజిస్ట్రార్‌, నల్సార్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లా, జస్టిస్‌ సిటీ, షామీర్‌పేట, హైదరాబాద్‌ - 500101

లింక్‌: https://apply.nalsar.ac.in/register

వెబ్‌సైట్‌: doms.nalsar.ac.in

Updated Date - 2022-11-14T14:49:21+05:30 IST