YSR Universityలో పారామెడికల్‌ కౌన్సెలింగ్‌

ABN , First Publish Date - 2022-12-24T15:27:56+05:30 IST

విజయవాడ (Vijayawada)లోని డా.వైఎస్సార్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సె‌స్ (Dr. YSR University of Health Sciences)-ఫైనల్‌ ఫేజ్‌ పారామెడికల్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌ను విడుదల

YSR Universityలో పారామెడికల్‌ కౌన్సెలింగ్‌
పారామెడికల్‌ కౌన్సెలింగ్‌

విజయవాడ (Vijayawada)లోని డా.వైఎస్సార్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సె‌స్ (Dr. YSR University of Health Sciences)-ఫైనల్‌ ఫేజ్‌ పారామెడికల్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. బీపీటీ, బీఎస్సీ పారామెడికల్‌ టెక్నాలజీ, బీఎస్సీ నర్సింగ్‌ ప్రోగ్రామ్‌లలో మిగిలిన కాంపిటెంట్‌ అథారిటీ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేస్తారు. నూతనంగా అనుమతి పొందిన కాలేజీల్లోని సీట్లను, ఫైనల్‌ ఫేజ్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియలో మిగిలిన సీట్లను కూడా నిబంధనల ప్రకారం భర్తీ చేస్తారు. ఇప్పటికే సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ పూర్తయి ఫైనల్‌ మెరిట్‌ జాబితాలో ఉన్న అభ్యర్థులు వెబ్‌ ఆప్షన్స్‌ ఇచ్చుకోవచ్చు. కాలేజీ మారదలచుకున్నవారు, సీటు వచ్చినా ఎక్కడా జాయిన్‌ కానివారు, ఇప్పటివరకు వెబ్‌ ఆప్షన్స్‌ ఇచ్చుకోనివారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

సీట్ల వివరాలు

  • నూతనంగా అనుమతి పొందిన అమర కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌(తిరుపతి), ఆర్‌హెచ్‌ కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌(విజయవాడ-పోరంకి) కళాశాలల్లో ఒక్కోదానిలో 36 సీట్లు ఉన్నాయి.

  • కర్నూలులోని విశ్వభారతి కాలేజ్‌ ఆఫ్‌ అలైడ్‌ అండ్‌ హెల్త్‌ కేర్‌ ప్రొఫెషన్స్‌ కళాశాలలో ఆప్టోమెట్రిక్‌ టెక్నాలజీ, రెనల్‌ డయాలసిస్‌, కార్డియాక్‌ కేర్‌ టెక్నాలజీ అండ్‌ కార్డియో వాస్కులర్‌ టెక్నాలజీ, అనెస్తీషియాలజి టెక్నాలజీ అండ్‌ ఆపరేషన్‌ టెక్నాలజీ, ఇమేజింగ్‌ టెక్నాలజీ, ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నాలజీ, రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ, పెర్ఫ్యూజన్‌ టెక్నాలజీ విభాగాలకు సంబంధించి ఒక్కోదానిలో 12 సీట్లు ఉన్నాయి.

ముఖ్య సమాచారం

వెబ్‌ ఆప్షన్స్‌కు చివరి తేదీ: డిసెంబరు 26

వెబ్‌సైట్‌: drntruhs.in

Updated Date - 2022-12-24T15:27:57+05:30 IST