Hyderabad IMTలో పీజీడీఎం
ABN , First Publish Date - 2022-11-11T12:18:16+05:30 IST
హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ(Institute of Management Technology) (ఐఎంటీ) - పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్(Post Graduate Diploma in Management) (పీజీడీఎం) ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి
హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ(Institute of Management Technology) (ఐఎంటీ) - పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్(Post Graduate Diploma in Management) (పీజీడీఎం) ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. పీజీడీఎం, పీజీడీఎం(ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్), పీజీడీఎం(మార్కెటింగ్) ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇవి రెండేళ్ల వ్యవధి గల రెసిడెన్షియల్ ప్రోగ్రామ్‌లు. వీటికి ఏఐసీటీఈ, ఎస్‌ఏక్యూఎస్, ఎన్‌బీఏ, ఏఐయూ సంస్థల గుర్తింపు ఉంది. ప్రోగ్రామ్‌లను ట్రైమెస్టర్ విధానంలో నిర్వహిస్తారు. ఒక్కో ట్రైమెస్టర్ పది వారాలు ఉంటుంది. మరో వారం కాంప్రహెన్సివ్ ఎగ్జామ్ ఉంటుంది. మొదటి సంవత్సరం కోర్సు పూర్తయ్యాక మూడు నెలల సమ్మర్ టర్మ్ ఉంటుంది. ఈ సమయంలో అభ్యర్థులు ఇంటర్న్‌షిప్, స్టూడెంట్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్, మేనేజ్‌మెంట్ థీసిస్ అండ్ సెమినార్స్‌లలో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. పీజీడీఎం ప్రోగ్రామ్‌ల ప్రారంభానికి ముందు రెండు వారాల మేనేజ్‌మెంట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్(ఎంఓపీ)ను నిర్వహిస్తారు.
ప్రోగ్రామ్‌ల వివరాలు
పీజీడీఎం ప్రోగ్రామ్‌లో బిజినెస్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫౌండేషన్ కోర్సు లు, ఎలక్టివ్ కోర్సులు ఉంటాయి. స్ట్రాటజీ, మార్కెటింగ్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్, అనలిటిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్‌లలో ఒకదాన్ని అభ్యర్థులు ఎంచుకోవచ్చు.
పీజీడీఎం(ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్) ప్రోగ్రామ్‌లో కార్పొరేట్ ఫైనాన్స్, ప్రాజెక్ట్ ఫైనాన్స్, సెక్యూరిటీ అనాలిసిస్, పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్, ఇన్వె్‌స్టమెంట్ బ్యాం కింగ్, ఫైనాన్షియల్ ఎకనామెట్రిక్స్ కోర్ కోర్సులతోపాటు బిజినెస్ మేనేజ్‌మెంట్ సంబంధిత కోర్ సబ్జెక్ట్‌లు ఉంటాయి.
పీజీడీఎం(మార్కెటింగ్) ప్రోగ్రామ్‌లో సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, డిజిటల్ మార్కెటింగ్, బ్రాండ్ మేనేజ్‌మెంట్, ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్ కమ్యూనికేషన్స్, ఇంటర్నేషనల్ మార్కెటింగ్, మార్కెటింగ్ రిసెర్చ్ తదితర సబ్జెక్ట్‌లు ఉంటాయి.
స్టూడెంట్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ కింద దక్షిణ అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన 25కి పైగా యూనివర్సిటీలతో హైదరాబాద్ ఐఎంటీ ఒప్పందాలు కుదుర్చుకొంది. దీని ప్రకారం అభ్యర్థులు ఇంటర్నేషనల్ బిజినెస్ అంశాలు, ఇంటర్నేషనల్ సోషల్ స్కిల్స్ నేర్చుకొనే అవకాశం లభిస్తుంది.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ద్వితీయ శ్రేణి మార్కులతో ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం చివరి సంవత్సర పరీక్షలు రాసేవారు కూడా అర్హులే. వీరు అడ్మిషన్స్ నాటికి సర్టిఫికెట్‌లు, మార్కుల పత్రాలు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. క్యాట్ 2022/ ఎక్స్‌ఏటీ 2023/ జీమ్యాట్ (2019 జనవరి 1 నుంచి 2023 ఫిబ్రవరి 28 మధ్య స్కోర్)/ సీమ్యాట్ 2023 స్కోర్ ఉండాలి.
ఎంపిక: అకడమిక్ మెరిట్, జాతీయ పరీక్ష స్కోర్, కౌన్సెలింగ్, క్రిటికల్ థింకింగ్ స్కిల్స్, పర్సనల్ ఇంటర్వ్యూ, ప్రొఫెషనల్ అనుభవం, అకడమిక్ డైవర్సిటీ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ. 2500
దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 25
వెబ్‌సైట్: www.imthyderabad.edu.in