జయశంకర్‌ అగ్రికల్చరల్‌ వర్సిటీలో PG, PHD

ABN , First Publish Date - 2022-11-23T15:22:09+05:30 IST

హైదరాబాద్‌-రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ స్టేట్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ(Agricultural University) (పీజేటీఎస్‌ఏయూ)- పీజీ, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లలో

జయశంకర్‌ అగ్రికల్చరల్‌ వర్సిటీలో PG, PHD
PG, PHD

హైదరాబాద్‌-రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ స్టేట్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ(Agricultural University) (పీజేటీఎస్‌ఏయూ)- పీజీ, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి విడివిడిగా నోటిఫికేషన్‌లు విడుదల చేసింది. హైదరాబాద్‌ (రాజేంద్రనగర్‌, సైఫాబాద్‌), జగిత్యాల, సంగారెడ్డి (కంది), బాపట్ల వ్యవసాయ కళాశాలల్లో పీజీ, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లను ఆఫర్‌ చేస్తున్నారు.

స్పెషలైజేషన్‌లు - సీట్లు

ఎమ్మెస్సీ (అగ్రికల్చర్‌): మొత్తం 117 సీట్లు ఉన్నాయి. వీటిలో మూడింటిని దివ్యాంగులకు ప్రత్యేకించారు. రాజేంద్రనగర్‌ క్యాంప్‌సలో అగ్రానమీ 17, అగ్రికల్చరల్‌ ఎకనామిక్స్‌ 6, ఎంటమాలజీ 10, అగ్రికల్చరల్‌ ఎక్స్‌టెన్షన్‌ ఎడ్యుకేషన్‌ 6, జెనెటిక్స్‌ అండ్‌ ప్లాంట్‌ బ్రీడింగ్‌ 15, ప్లాంట్‌ పాథాలజీ 8, ప్లాంట్‌ సైకాలజీ 2, సాయిల్‌ సైన్స్‌ 8, సీడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ 6, మైక్రోబయాలజీ 4, అగ్రికల్చరల్‌ స్టాటిస్టిక్స్‌ 2 సీట్లు; ఎంబీఏ(అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌) 16 సీట్లు ఉన్నాయి. జగిత్యాల క్యాంప్‌సలో అగ్రానమీ 5, జెనెటిక్స్‌ అండ్‌ ప్లాంట్‌ బ్రీడింగ్‌ 5, సాయిల్‌ సైన్స్‌ 4 సీట్లు ఉన్నాయి.

ఎమ్మెస్సీ(కమ్యూనిటీ సైన్స్‌): మొత్తం 17 సీట్లు ఉన్నాయి. దివ్యాంగులకు ఒక సీటు కేటాయించారు. హైదరాబాద్‌ క్యాంప్‌సలో ఫుడ్స్‌ అండ్‌ న్యూట్రిషన్‌ 8, హ్యూమన్‌ డెవల్‌పమెంట్‌ అండ్‌ ఫ్యామిలీ స్టడీస్‌ 2, రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ కన్జూమర్‌ సైన్స్‌(ఫ్యామిలీ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌) 2, ఎక్స్‌టెన్షన్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ మేనేజ్‌మెంట్‌ 2, అప్పారెల్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌ సైన్స్‌ 2 సీట్లు ఉన్నాయి.

ఎంటెక్‌ (అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌): మొత్తం 6 సీట్లు ఉన్నాయి. సంగారెడ్డి- కంది క్యాంప్‌సలో సాయిల్‌ అండ్‌ వాటర్‌ కన్జర్వేషన్‌ ఇంజనీరింగ్‌ 2; బాపట్ల క్యాంప్‌సలో ప్రాసెసింగ్‌ అండ్‌ ఫుడ్‌ ఇంజనీరింగ్‌ 2, ఫాం మెషినరీ అండ్‌ పవర్‌ ఇంజనీరింగ్‌ 2 సీట్లు ఉన్నాయి.

పీహెచ్‌డీ(అగ్రికల్చర్‌): మొత్తం 31 సీట్లు ఉన్నాయి. దివ్యాంగులకు 1 సీటు ప్రత్యేకించారు. రాజేంద్రనగర్‌ క్యాంప్‌సలో అగ్రానమీ 6, అగ్రికల్చరల్‌ ఎకనామిక్స్‌ 2, ఎంటమాలజీ 4, అగ్రికల్చరల్‌ ఎక్స్‌టెన్షన్‌ 4, జెనెటిక్స్‌ అండ్‌ ప్లాంట్‌ బ్రీడింగ్‌ 6, ప్లాంట్‌ పాథాలజీ 2, సాయిల్‌ సైన్స్‌ 4, సీడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ 2 సీట్లు ఉన్నాయి.

పీహెచ్‌డీ(కమ్యూనిటీ సైన్స్‌): మొత్తం 8 సీట్లు ఉన్నాయి. హైదరాబాద్‌ క్యాంప్‌సలో ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌ 6, ఎక్స్‌టెన్షన్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ మేనేజ్‌మెంట్‌ 2 సీట్లు ఉన్నాయి.

పీహెచ్‌డీ(అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌): మొత్తం రెండు సీట్లు ఉన్నాయి. బాపట్ల క్యాంప్‌సలో సాయిల్‌ అండ్‌ వాటర్‌ కన్జర్వేషన్‌ ఇంజనీరింగ్‌, ఫాం మెషినరీ అండ్‌ పవర్‌ ఇంజనీరింగ్‌ స్పెషలైజేషన్‌లలో ఒక్కోదానిలో ఒక సీటు ఉంది.

అర్హత: స్టేట్‌/ సెంట్రల్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీలు, ఐకార్‌ గుర్తింపు పొందిన యూనివర్సిటీలలో చదివి ఉండాలి. అభ్యర్థి వయసు డిసెంబరు 31 నాటికి 40 ఏళ్లు మించకూడదు.

  • పీజీ కోర్సుల్లో ప్రవేశానికి స్పెషలైజేషన్‌ను అనుసరించి నాలుగేళ్ల వ్యవధి గల(బీఎస్సీ/బీఎస్సీ ఆనర్స్‌) (అగ్రికల్చర్‌/హార్టికల్చర్‌/హోం సైన్స్‌/ కమ్యూనిటీ సైన్స్‌ /ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ/ ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ న్యూట్రిషన్‌); బీటెక్‌(అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌/ఫుడ్‌ టెక్నాలజీ/ డెయిరీ); బీహెచ్‌ఎస్సీ (రూరల్‌)/ బీహెచ్‌ఎస్సీ/ బీవీఎస్సీ అండ్‌ ఏహెచ్‌/ బీఎ్‌ఫఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. కనీసం 50 శాతం మార్కులు తప్పనిసరి. ఐకార్‌ పీజీ - ఏఐఈఈఏ 2022 (ఐకార్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌) రాసి ఉండాలి.

  • పీహెచ్‌డీలో ప్రవేశానికి సంబంధిత స్పెషలైజేషన్‌తో ఎమ్మెస్సీ(అగ్రికల్చర్‌)/ ఎంటెక్‌(అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌)/ ఎమ్మెస్సీ(కమ్యూనిటీ సైన్స్‌) పూర్తిచేసి ఉండాలి. ద్వితీయ శ్రేణి మార్కులు తప్పనిసరి. ఐకార్‌ ఏఐసీఈ - జేఆర్‌ఎఫ్‌/ ఎస్‌ఆర్‌ఎఫ్‌ (పీహెచ్‌డీ) 2022 ఎగ్జామ్‌ రాసి ఉండాలి.

ఎంపిక

  • పీజీ కోర్సుల్లో ప్రవేశానికి డిగ్రీ స్థాయి మార్కులకు 30 శాతం, ఐకార్‌ పీజీ - ఏఐఈఈఏ 2022(ఐకార్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌) స్కోర్‌కు 70 శాతం వెయిటేజీ ఇస్తూ అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంబీఏ(ఏబీఎం) కోర్సుకు మాత్రం ఐకార్‌ పీజీ - ఏఐఈఈఏ 2022 స్కోర్‌, డిగ్రీ స్కోర్‌లకు 70 మార్కులు; గ్రూప్‌ డిస్కషన్‌కు 20 మార్కులు, పర్సనల్‌ ఇంటర్వ్యూకు 10 మార్కుల వెయిటేజీ ఇస్తూ అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

  • పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి డిగ్రీ స్థాయి మార్కులకు 10 శాతం, పీజీ స్థాయి మార్కులకు 30 శాతం, ఐకార్‌ ఏఐసీఈ- జేఆర్‌ఎఫ్‌/ ఎస్‌ ఆర్‌ఎ్‌ఫ(పీహెచ్‌డీ) 2022 స్కోర్‌కు 60 శాతం వెయిటేజీ ఇస్తూ అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.1800; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.900

దరఖాస్తు ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ: డిసెంబరు 1

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 3

కరక్షన్‌ విండో ఓపెన్‌: డిసెంబరు 4 నుంచి 5 వరకు

వెబ్‌సైట్‌: www.pjtsau.edu.in

Updated Date - 2022-11-23T15:22:11+05:30 IST