ధీరూభాయ్‌ అంబానీ ఇన్‌స్టిట్యూట్‌‌లో PhD

ABN , First Publish Date - 2022-11-11T14:37:02+05:30 IST

గాంధీనగర్‌లోని ధీరూభాయ్‌ అంబానీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ(Dhirubhai Ambani Institute) (డీఏఐఐసీటీ)-పీహెచ్‌డీ వింటర్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ప్రోగ్రామ్‌ వ్యవధి కనీసం మూడేళ్లు

ధీరూభాయ్‌ అంబానీ ఇన్‌స్టిట్యూట్‌‌లో PhD
PhD

గాంధీనగర్‌లోని ధీరూభాయ్‌ అంబానీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ(Dhirubhai Ambani Institute) (డీఏఐఐసీటీ)-పీహెచ్‌డీ వింటర్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ప్రోగ్రామ్‌ వ్యవధి కనీసం మూడేళ్లు ఉంటుంది. గరిష్ఠంగా ఆరేళ్లలో పూర్తిచేసే వీలుంది. రెగ్యులర్‌, పార్ట్‌ టైం కేటగిరీలు అందుబాటులో ఉన్నాయి. ప్రొక్టోర్డ్‌ ఆన్‌లైన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌, ఆన్‌లైన్‌/ పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.

విభాగాలు: ఇన్ఫర్మేషన్‌ & కమ్యూనికేషన్‌ టెక్నాలజీ, దీనికి సంబంధించిన ఇతర విభాగాలు, మేథమెటిక్స్‌, ఫిజికల్‌ సైన్సెస్‌, కంప్యూటేషనల్‌ సైన్స్‌, ఇంగ్లీష్‌, హిస్టరీ, ఆంత్రోపాలజీ, కంపారిటివ్‌ లిటరేచర్‌, ఫిలాసఫీ, డిజైన్‌.

అర్హత: ఐసీటీ, సంబంధిత విభాగాలకు ఐసీటీ/ సీఎస్‌/ఈసీ/ఐటీ/ఈఈ/మేథమెటిక్స్‌/ స్టాటిస్టిక్స్‌/ ఫిజిక్స్‌/ బయోఇన్ఫర్మాటిక్స్‌/ ఎలకా్ట్రనిక్స్‌ స్పెషలైజేషన్‌లతో; మేథమెటిక్స్‌, నేచురల్‌ సైన్సెస్‌ విభాగాలకు ఇంజనీరింగ్‌ ఫిజిక్స్‌/ కంప్యూటేషనల్‌ సైన్స్‌/ కంప్యూటర్‌ సైన్స్‌/సైంటిఫిక్‌ కంప్యూటింగ్‌/ ఫిజిక్స్‌/ మేథమెటిక్స్‌/ ఎలకా్ట్రనిక్స్‌/ బయోఇన్ఫర్మాటిక్స్‌ స్పెషలైజేషన్‌లతో ఎంఈ/ ఎంటెక్‌/ ఎంసీఏ/ ఎమ్మెస్సీ/ ఎంఫిల్‌/ బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రథమ శ్రేణి మార్కులు తప్పనిసరి. ఆర్ట్స్‌, హ్యుమానిటీస్‌, సోషల్‌ సైన్సెస్‌ విభాగాలకు కనీసం 55 శాతం మార్కులతో ఎంఏ/ ఎంకాం/ ఎంబీఏ/ ఎంఫిల్‌ ఉత్తీర్ణులై ఉండాలి. పార్ట్‌ టైం కేటగిరీలో చేరాలనుకొనే అభ్యర్థులకు కనీసం మూడేళ్లపాటు ప్రముఖ రిసెర్చ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ సంస్థల్లో పనిచేసిన అనుభవం తప్పనిసరి. వయోపరిమితి నిబంధనలు లేవు.

ఎంపిక: యూజీసీ/ సీఎస్‌ఐఆర్‌/ డీఎస్‌టీ/ ఇన్‌స్పయిర్‌ నుంచి నెట్‌/జేఆర్‌ఎఫ్‌ అర్హత పొందినవారిని; పీఎం స్కాలర్‌షిప్‌/ విశ్వేశ్వరాయ పీహెచ్‌డీ స్కీమ్‌నకు ఎంపికైనవారిని నేరుగా ఇంటర్వ్యూకి అనుమతిస్తారు. మిగిలినవారికి ఆన్‌లైన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ నిర్వహించి మెరిట్‌ ప్రకారం షార్ట్‌లిస్ట్‌ రూపొందిస్తారు. స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్ప్‌సను పరిగణనలోకి తీసుకొని ఆన్‌లైన్‌/ పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఫెలోషిప్‌: రెగ్యులర్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశం పొందిన అభ్యర్థులకు టీచింగ్‌ అసిస్టెంట్‌షిప్‌/ రిసెర్చ్‌ అసిస్టెంట్‌షిప్‌ ద్వారా నాలుగేళ్లపాటు ఫెలోషిప్‌ అందిస్తారు. ఇందుకు అభ్యర్థులు లేబరేటరీ కోర్సులు నిర్వహించడం, అండర్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్థులకు బోధించడం, రిసెర్చ్‌ ప్రాజెక్ట్‌ వర్క్‌, అడ్మినిస్ట్రేషన్‌ వర్క్‌ తదితర బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. కాంప్రహెన్సివ్‌ ఎగ్జామ్‌ పూర్తిచేసేవరకు నెలకు రూ.28,000ల స్టయిపెండ్‌ ఇస్తారు. తరవాత మొదటి రెండేళ్లు నెలకు రూ.31,000; చివరి రెండేళ్లు నెలకు రూ.35,000ల ఫెలోషిప్‌ చెల్లిస్తారు. ఎంఫిల్‌ పూర్తిచేసినవారికి, నెట్‌/ గేట్‌ వ్యాలిడ్‌ స్కోర్‌ 500 లేదా ఆపై ఉన్నవారికి, డిగ్రీ/ పీజీలో టాప్‌ ర్యాంక్స్‌ సాధించినవారికి కాంప్రహెన్సివ్‌ ఎగ్జామ్‌ తరవాత నెలకు రూ.35,000లు ఇస్తారు.

ఎంట్రెన్స్‌ టెస్ట్‌ వివరాలు: ఇందులో మొత్తం 20 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. ఇంజనీరింగ్‌ అభ్యర్థులకు నిర్వహించే పరీక్షలో మేథమెటిక్స్‌ నుంచి డిస్ర్కీట్‌ స్ట్రక్చర్స్‌, క్యాలిక్యులస్‌, బేసిక్‌ లీనియర్‌ ఆల్జీబ్రా అంశాలనుంచి 5 ప్రశ్నలు ఇస్తారు. మిగిలిన 15 ప్రశ్నలను సంబంధిత స్పెషలైజేషన్‌ నుంచి అడుగుతారు. సీఎస్‌ఈ అభ్యర్థులకు డేటా స్ట్రక్చర్స్‌ అండ్‌ అల్గోరిథమ్స్‌, ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌, థియరీ ఆఫ్‌ కంప్యూటేషన్‌, ప్రోగ్రామింగ్‌ అంశాలనుంచి; ఈసీఈ అభ్యర్థులకు బేసిక్‌ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్స్‌ సర్క్యూట్స్‌, డిజిటల్‌ కమ్యూనికేషన్‌, డిజిటల్‌ సిగ్నల్‌ ప్రాసెసింగ్‌ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. మేథమెటిక్స్‌, నేచురల్‌ సైన్సెస్‌ అభ్యర్థులు వారు ఎంచుకొన్న ప్రకారం ఫిజిక్స్‌/మేథమెటిక్స్‌ పేపర్‌ రాయాల్సి ఉంటుంది. ఫిజిక్స్‌ పేపర్‌లో మేథమెటిక్స్‌(డిస్ర్కీట్‌ స్ట్రక్చర్స్‌, క్యాలిక్యులస్‌, బేసిక్‌ లీనియర్‌ ఆల్జీబ్రా) నుంచి అయిదు ప్రశ్నలు; క్లాసికల్‌ మెకానిక్స్‌, ఎలక్ట్రోడైనమిక్స్‌, క్వాంటం మెకానిక్స్‌, థర్మోడైనమిక్స్‌ అంశాలనుంచి 15 ప్రశ్నలు ఇస్తారు. మేథమెటిక్స్‌ పేపర్‌లో రియల్‌ అనాలిసిస్‌, కాంప్లెక్స్‌ అనాలిసిస్‌, అబ్‌స్ట్రాక్ట్‌ ఆల్జీబ్రా, ప్రాబబిలిటీ అంశాలనుంచి ప్రశ్నలు అడుగుతారు. మిగిలిన విభాగాలకు నిర్వహించే ఎగ్జామ్‌లో సంబంధిత సబ్జెక్ట్‌ నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు కేటాయించారు. తప్పుగా గుర్తించిన సమాధానానికి ఒక మార్కు కోత విధిస్తారు. పరీక్ష సమయం గంట. ఎంట్రెన్స్‌ టెస్ట్‌లో అర్హత సాధించిన వారికి విభాగాలవారీగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో డిగ్రీ, పీజీ స్థాయుల్లో పూర్తిచేసిన ప్రాజెక్ట్‌లకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు.]

ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: రూ.1200 + 18 శాతం జీఎస్‌టీ

దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 2

ఎంట్రెన్స్‌ టెస్ట్‌: డిసెంబరు 11న

ఇంటర్వ్యూకి ఎంపికైన అభ్యర్థుల లిస్ట్‌ విడుదల: డిసెంబరు 16న

ఇంటర్వ్యూలు: డిసెంబరు 22, 23

ఫలితాలు విడుదల: డిసెంబరు 27న

వెబ్‌సైట్‌: daiict.ac.in

Daiict.gif

Updated Date - 2022-11-11T14:37:04+05:30 IST