T tasting and marketingలో ప్రొఫెషనల్‌ సర్టిఫికెట్‌

ABN , First Publish Date - 2022-12-24T15:38:54+05:30 IST

బెంగళూరు (Bangalore)లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాంటేషన్‌ మేనేజ్‌మెంట్‌(Indian Institute of Plantation Management) (ఐఐపీఎం) - ‘ప్రొఫెషనల్‌ సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌ ఆన్‌

T tasting and marketingలో ప్రొఫెషనల్‌ సర్టిఫికెట్‌
ప్రొఫెషనల్‌ సర్టిఫికెట్‌

బెంగళూరు (Bangalore)లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాంటేషన్‌ మేనేజ్‌మెంట్‌(Indian Institute of Plantation Management) (ఐఐపీఎం) - ‘ప్రొఫెషనల్‌ సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌ ఆన్‌ టీ టేస్టింగ్‌ అండ్‌ మార్కెటింగ్‌(T tasting and marketing) (పీసీపీ - టీటీఎం)’ను అంది స్తోంది. టీ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా సహ కారంతో నిర్వహించే ఈ ఇంటెన్సివ్‌ ప్రోగ్రామ్‌ వ్యవధి 45 రోజులు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 17 నుంచి మే 31 వరకు ట్రెయినింగ్‌ సెషన్స్‌ ఉంటాయి. ఫ్రెషర్స్‌, టీ ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్‌ సహా టీ మాన్యుఫాక్చరింగ్‌, టీ ప్రొడక్షన్‌, టీ ట్రేడింగ్‌/బ్లెండింగ్‌, టీ రిటైలింగ్‌ విభాగాల్లో అనుభవం ఉన్నవారికి టెక్నికల్‌, ఫంక్షనల్‌, మార్కెటింగ్‌ అవసరాలకు తగ్గట్టుగా టీ టేస్టింగ్‌ సెషన్స్‌ నిర్వహిస్తారు.

ప్రోగ్రామ్‌ వివరాలు: ఇందులో టీ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, మార్కెట్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ టెక్నిక్‌లకు సంబంధించిన అంశాలు వివరించడంతోపాటు టీ టేస్టింగ్‌ స్కిల్స్‌ నేర్పిస్తారు. దేశ విదేశాల్లో తయారుచేసే టీ రకాలను టేస్ట్‌ చేసే మెథడాలజీని వివరిస్తారు. ప్రోగ్రామ్‌లో భాగంగా అకడమిక్‌, టెక్నికల్‌, ప్రాక్టికల్‌ మాడ్యూల్స్‌ ఉంటాయి. చివరలో అసె్‌సమెంట్‌ వర్క్‌ ఉంటుంది.

  • అకడమిక్‌ మాడ్యూల్‌లో టీ టేస్టింగ్‌ ఫర్‌ రైట్‌ మార్కెటింగ్‌, టీ టేస్టింగ్‌-ప్రొడక్షన్‌ అండ్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ అంశాలు; టెక్నికల్‌ మాడ్యూల్‌లో మైక్రో ప్రొఫైలింగ్‌ ఆఫ్‌ టీ గ్రేడింగ్‌, లాంగ్వేజ్‌ ఆఫ్‌ టీ టేస్టింగ్‌, కప్‌ టేస్టింగ్‌ టెక్నిక్స్‌, ఎలకా్ట్రనిక్‌ నోస్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్‌ టంగ్‌, ఎవల్యూషన్‌ అండ్‌ స్కోరింగ్‌, టేస్టింగ్‌ ఫర్‌ ప్రొక్యూర్‌మెంట్స్‌ అండ్‌ టీ బ్లెండ్స్‌, ప్యాలెట్‌ మెమరీ - టీ టేస్టింగ్‌/ బ్లెండింగ్‌ అంశాలు ఉంటాయి. ప్రాక్టికల్‌ మాడ్యూల్‌లో టీ టేస్టింగ్‌, సెన్సరీ స్కిల్స్‌కు సంబంధించిన శిక్షణతోపాటు ఫీల్డ్‌ స్టడీ, టీ ఎస్టేట్‌/ ఫ్యాక్టరీ విజిట్స్‌, మార్కెటింగ్‌ అంశాలు ఉంటాయి. అసె్‌సమెంట్‌లో ప్రాజెక్ట్‌ ప్రజంటేషన్‌, ప్రాక్టికల్‌ టెస్ట్‌లు, రిటెన్‌ టెస్ట్‌లు, కేస్‌ అనాలిసిస్‌, ఎక్స్‌పర్ట్‌ కమిటీ ఎవల్యూషన్‌ అండ్‌ సర్టిఫికేషన్‌ ఉంటాయి.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఇంగ్లీష్‌ చదవడం, రాయడంలో ప్రావీణ్యం తప్పనిసరి. టీ సంబంధిత ప్రొడక్షన్‌, మార్కెటింగ్‌ సంస్థలు స్పాన్సర్‌ చేసిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది. విదేశీయులు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు.

ఎంపిక: ఇంటర్వ్యూ, టీ టేస్టింగ్‌కు సంబంధించిన సైకోమెట్రిక్‌ టెస్ట్‌, బ్లైండ్‌ సెన్సరీ టెస్ట్‌ల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ముఖ్య సమాచారం

కోర్సు ఫీజు: రూ.80,000 + జీఎస్‌టీ (విదేశీయులకు 1100 యూఎస్‌ డాలర్లు)

దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.1000; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.500; విదేశీయులకు 15 యూఎస్‌ డాలర్లు

దరఖాస్తు చేరేందుకు చివరి తేదీ: 2023 మార్చి 31

వెబ్‌సైట్‌: www.iipmb.edu.in

Updated Date - 2022-12-24T15:38:56+05:30 IST