SRM JEEలో మంచి ర్యాంక్ సాధించాలంటే..!
ABN , First Publish Date - 2022-12-31T16:08:20+05:30 IST
చెన్నైలోని శ్రీ రామస్వామి మెమోరియల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (SRMIST) (ఎస్‌ఆర్‌ఎంఐఎస్‌టీ)-ఇంజనీరింగ్ డిగ్రీ ప్రోగ్రామ్ (Engineering Degree Programme)లలో ప్రవేశానికిగాను ‘ఎస్‌ఆర్‌ఎం జాయింట్
మొత్తం 7000 సీట్లు
చెన్నైలోని శ్రీ రామస్వామి మెమోరియల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (SRMIST) (ఎస్‌ఆర్‌ఎంఐఎస్‌టీ)-ఇంజనీరింగ్ డిగ్రీ ప్రోగ్రామ్ (Engineering Degree Programme)లలో ప్రవేశానికిగాను ‘ఎస్‌ఆర్‌ఎం జాయింట్ ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (ఎస్‌ఆర్‌ఎంజేఈఈఈ) 2023’ను నిర్వహిస్తోంది. ఈ ఎగ్జామ్‌లో సాధించిన ర్యాంక్ ఆధారంగా చెన్నైలోని కట్టంకులత్తూరు, వడపళని, రామాపురం, తిరుచిరాపల్లి క్యాంప్‌సలు; ఢిల్లీ-ఎన్‌సీఆర్ క్యాంప్‌స-ఘజియాబాద్; ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ (సోనెపట్-హరియాణా, ఆంధ్రప్రదేశ్)లలో అడ్మిషన్స్ ఇస్తారు. ఎస్‌ఆర్‌ఎంజేఈఈఈని మూడు ఫేజ్‌లలో నిర్వహిస్తారు. అభ్యర్థులు అన్నింటినీ రాయవచ్చు. ఈ ఎగ్జామ్ జేఈఈ మెయిన్(JEE Main) మాదిరిగానే ఉంటుంది. కానీ అంత కష్టంగా ఉండదు. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు ఫాలో అవుతూ జేఈఈ మెయిన్ గత అయిదేళ్ల పేపర్లను ప్రాక్టీస్ చేస్తే మంచి ర్యాంక్ సాధించవచ్చు. అన్ని క్యాంప్‌సలలో కలిపి మొత్తం 7,000 సీట్లు ఉన్నాయి.
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ప్రథమ శ్రేణి మార్కులతో మేథమెటిక్స్/ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ/ బయోటెక్నాలజీ/ బయాలజీ/టెక్నికల్ ఒకేషనల్ సబ్జెక్ట్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఇన్ఫర్మాటిక్స్ ప్రాక్టీసెస్/ అగ్రికల్చర్/ ఇంజనీరింగ్ గ్రాఫిక్స్/ బిజినెస్ స్టడీస్ ప్రధాన సబ్జెక్టులుగా ఇంటర్/ పన్నెండోతరగతి/ తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. సోనెపట్, ఢిల్లీ-ఎన్‌సీఆర్ క్యాంప్‌సలలో ప్రవేశానికి 50 శాతం మార్కులు చాలు. అభ్యర్థులు ఇంటర్ స్థాయి ఎగ్జామ్‌ను గరిష్ఠంగా రెండు అటెం్‌ప్టలలో(ఇంప్రూవ్‌మెంట్ సహా) పూర్తిచేయాలి. అభ్యర్థుల వయసు 2023 జూలై 31 నాటికి 16 ఏళ్లు నిండి ఉండాలి. పీసీఎం అభ్యర్థులు బీటెక్‌లో అన్ని బ్రాంచ్‌లను ఎంచుకోవచ్చు. పీఎంబీ, పీసీబీ అభ్యర్థులు మాత్రం బయోటెక్నాలజీ-జెనెటిక్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ-రీజనరేటివ్ మెడిసిన్, బయోమెడికల్ ఇంజనీరింగ్‌లను మాత్రమే ఎంచుకోవాలి. సెంట్రల్, స్టేట్ బోర్డు ఎగ్జామ్‌లలో ఫస్ట్ ర్యాంక్‌లు సాధించినవారికి; ఐఐటీ జేఈఈ మెయిన్‌లో 10,000లోపు ర్యాంక్ సాధించినవారికి; స్కాలాస్టిక్ అసె్‌సమెంట్ టెస్ట్ (ఎస్‌ఏటీ) అర్హత పొందినవారికి; జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులకు నేరుగా అడ్మిషన్స్ ఇస్తారు.
ఎస్‌ఆర్‌ఎంజేఈఈఈ వివరాలు: ఇది రిమోట్ ప్రొక్టోర్డ్ ఆన్‌లైన్ బేస్డ్ టెస్ట్. ఇందులో మొత్తం 125 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు. మేథమెటిక్స్/ బయాలజీ నుంచి 40 ప్రశ్నలు; ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి ఒక్కోదానిలో 35 ప్రశ్నలు; ఆప్టిట్యూడ్ నుంచి 10 ప్రశ్నలు; ఇంగ్లీష్ నుంచి 5 ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం మార్కులు 125. నెగెటివ్ మార్కులు లేవు. పరీక్ష సమయం రెండున్నర గంటలు.
ముఖ్య సమాచారం
దరఖాస్తు ఫీజు: రూ.1200
మొదటి ఫేజ్ దరఖాస్తుకు చివరి తేదీ: 2023 ఏప్రిల్ 16
మొదటి ఫేజ్ ఎగ్జామ్: 2023 ఏప్రిల్ 21, 22, 23
రెండో ఫేజ్ దరఖాస్తుకు చివరి తేదీ: 2023 జూన్ 5
రెండో ఫేజ్ ఎగ్జామ్: 2023 జూన్ 10, 11
మూడో ఫేజ్ దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 17
మూడో ఫేజ్ ఎగ్జామ్: 2023 జూలై 22, 23
వెబ్‌సైట్: srmist.edu.in/admission-india/engineering/