Repco Bank: గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణతతో జూనియర్‌ అసిస్టెంట్లు

ABN , First Publish Date - 2022-11-16T15:36:43+05:30 IST

చెన్నైలోని రెప్కో బ్యాంక్‌(Repco Bank) జూనియర్‌ అసిస్టెంట్‌/క్లర్క్‌ పోస్టుల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

Repco Bank: గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణతతో జూనియర్‌ అసిస్టెంట్లు
జూనియర్‌ అసిస్టెంట్లు

చెన్నైలోని రెప్కో బ్యాంక్‌(Repco Bank) జూనియర్‌ అసిస్టెంట్‌/క్లర్క్‌ పోస్టుల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

రాష్ట్రాల వారీగా ఖాళీలు: తమిళనాడు-40; ఆంధ్రప్రదేశ్‌-4; కేరళ-2, కర్ణాటక-4

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.

వయసు: 21 నుంచి 28 ఏళ్లు ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.17,900 నుంచి రూ.47,920 చెల్లిస్తారు

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష ఆధారంగా

పరీక్ష విధానం: పరీక్ష వ్యవధి 120 నిమిషాలు. మొత్తం కేటాయించిన మార్కులు 200. ప్రశ్నపత్రంలో 200 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఉంటాయి. రీజనింగ్‌, ఇంగ్లీష్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.

దరఖాస్తు ఫీజు: రూ.900

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 25

వెబ్‌సైట్‌: https://www.repcobank.com/-careers.php

Updated Date - 2022-11-16T15:36:44+05:30 IST