SVNIT సూరత్‌లో టెక్నీషియన్లు.. ఖాళీలెన్నంటే..
ABN , First Publish Date - 2022-11-16T15:17:17+05:30 IST
గుజరాత్ రాష్ట్రం సూరత్‌లోని సర్దార్ వల్లభాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(Sardar Vallabhbhai National Institute of Technology)... ఎస్వీనిట్‌లోని వివిధ విభాగాల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీలు 26

1. సీనియర్ టెక్నీషియన్: 13 పోస్టులు
2. టెక్నీషియన్: 13 పోస్టులు
విభాగాలు: కెమికల్ ఇంజినీరింగ్/కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్
అర్హత: సీనియర్ సెకండరీ(10+2), ఐటీఐ లేదా డిప్లొమా ఉత్తీర్ణత.
వయసు: టెక్నీషియన్ పోస్టులకు 27 ఏళ్లు, సీనియర్ టెక్నీషియన్ పోస్టులకు 33 ఏళ్లు మించకూడదు.
ఎంపిక ప్రక్రియ: ఎంపిక పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు రుసుము: రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీమెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 2
దరఖాస్తు హార్డ్ కాపీ స్వీకరణకు చివరి తేదీ: డిసెంబరు 12
వెబ్‌సైట్: https://www.svnit.ac.in/