ప్రతీ ఉపాధ్యాయురాలు యూనిఫాం ధరించాలి

ABN , First Publish Date - 2022-02-03T19:58:19+05:30 IST

మండలంలో గల ప్రతీ అంగన్‌వాడి ఉపాధ్యాయురాలు యూనిఫాం తప్పనిసరి ధరించాలని ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ సీడీపీవో నాగమణి అన్నారు. మండల కేంద్రంలో స్థానిక

ప్రతీ ఉపాధ్యాయురాలు యూనిఫాం ధరించాలి

లక్ష్మణచాంద, ఫిబ్రవరి 2 : మండలంలో గల ప్రతీ అంగన్‌వాడి ఉపాధ్యాయురాలు యూనిఫాం తప్పనిసరి ధరించాలని  ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ సీడీపీవో నాగమణి అన్నారు. మండల కేంద్రంలో స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన సెక్టార్‌ సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రత్యేకంగా సరఫరా చేసిన చేనేతచీరలను యూనిఫాంగా టీచర్లందరికీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఎంపీడీవో శేఖర్‌ మాట్లాడుతూ... ప్రతి అంగన్‌వాడీ కేంద్రంను సరికొత్తగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామన్నారు. ఎం పీపీ అడ్వాల పద్మ రమేష్‌ మాట్లాడుతూ... కమిటీల సమావేశం తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు ఎంపీపీ అడ్వాల పద్మ రమేష్‌, ఎంపీడీవో శేఖర్‌, ఎంపీఈవో నసీరుద్దీన్‌, ఏసీడీపీవో నాగమణి, సూపర్‌వైజర్‌ భాగ్యవతి, స్థానిక సర్పంచ్‌ సురకంటి ముత్యంరెడ్డి, అంగన్‌వాడి ఉపాధ్యాయునులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-02-03T19:58:19+05:30 IST