Schedule: జూన్ 4న జేఈఈ అడ్వాన్స్‌డ్
ABN , First Publish Date - 2022-12-23T11:28:27+05:30 IST
జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష షెడ్యూల్ (JEE Advanced Exam Schedule) ఖరారైంది. వచ్చే ఏడాది జూన్ 4వ తేదీనఈ పరీక్షను నిర్వహించనున్నట్టు ఐఐటీ
హైదరాబాద్, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష షెడ్యూల్ (JEE Advanced Exam Schedule) ఖరారైంది. వచ్చే ఏడాది జూన్ 4వ తేదీనఈ పరీక్షను నిర్వహించనున్నట్టు ఐఐటీ గువాహటి వెల్లడించింది. ఈ మేరకు అధికారులు గురువారం షెడ్యూల్‌ను విడుదల చేశారు. దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీ (IIT)ల్లో 2023-24 విద్యా సంవత్సరానికి గాను ఇంజనీరింగ్ కోర్సు (Engineering course)ల్లో ప్రవేశానికి ఈ పరీక్షను నిర్వహించనున్నారు. జేఈఈ మెయిన్స్(JEE Mains)లో అర్హత సాధించిన విద్యార్థులు ఏప్రిల్ 30వ తేదీ నుంచి మే 4 వరకు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు మే 5 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న విద్యార్థులైతే ఏప్రిల్ 24 నుంచి రిజిస్ట్రేషన్లు చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. మే 29 నుంచి జూన్ 4 వరకు అడ్మిట్‌కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. జూన్ 18వ తేదీన ఫలితాలను ప్రకటించనున్నారు. కాగా, జేఈఈ మెయిన్ పరీక్ష- 2023 జనవరి 24 నుంచి 31 మధ్య జరగనుండగా రెండో సెషన్‌ను ఏప్రిల్ 6 నుంచి 12వ తేదీల మధ్య నిర్వహించనున్నారు.