KL Global Business School: కేఎల్ గ్లోబల్ బిజినెస్ స్కూల్‌లో ‘కాఫీ విత్ హెచ్ఆర్’

ABN , First Publish Date - 2022-11-25T19:50:06+05:30 IST

సరైన ‘కార్పొరేట్ మైండ్‌సెట్’ని పెంపొందించేందుకు, పని-సంస్కృతి, వృత్తిపరమైన విలువలను పెంచేందుకు కేఎల్‌హెచ్ గ్లోబల్ బిజినెస్ స్కూల్

KL Global Business School: కేఎల్ గ్లోబల్ బిజినెస్ స్కూల్‌లో ‘కాఫీ విత్ హెచ్ఆర్’

హైదరాబాద్: సరైన ‘కార్పొరేట్ మైండ్‌సెట్’ని పెంపొందించేందుకు, పని-సంస్కృతి, వృత్తిపరమైన విలువలను పెంచేందుకు కేఎల్‌హెచ్ గ్లోబల్ బిజినెస్ స్కూల్ (KL Global Business School) ఇటీవల హైదరాబాద్‌లోని తన క్యాంపస్‌లో ‘కాఫీ విత్ హెచ్ఆర్’ని నిర్వహించింది. ఇందులో మొదటి రకం సంభాషణకు హెచ్ఆర్ నిపుణురాలు, నగరంలోని అరెస్సియం బిజినెస్ పార్టనిరింగ్, టాలెంట్ మేనేజ్‌మెంట్ హెడ్ సుజిత రావూరి సారథ్యం వహించారు. విద్యార్థుల కోసం వరుసగా పలు ఇంటరాక్టివ్ సదస్సులను నిర్వహించారు. అలాగే, పలువురు ప్రముఖులు, వ్యాపార నిపుణులను కలిసే అవకాశం కల్పించారు. తద్వారా ప్రస్తుతం అనుసరిస్తున్న ప్రక్రియలు, ఉద్యోగ మార్కెట్‌,కార్పొరేట్‌ ప్రపంచంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడంపై అవగాహన కల్పించారు.

ఈ ‘కాఫీ విత్ హెచ్ఆర్’ కార్యక్రమానికి మేనేజ్‌మెంట్ విద్యార్థుల నుంచి అనూహ్య స్పందన లభించింది. స్ఫూర్తినింపే వాస్తవ జీవిత కథలు, విజయగాథలు, సాధించిన విజయాలను తెలుసుకుని ఉత్సాహం పొందారు. కేఎల్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ జీపీ సారథి వర్మ మాట్లాడుతూ.. ఈ తరహా సదస్సులు కార్పొరేట్‌ ప్రపంచంలో అత్యున్నత ప్రక్రియల పట్ల లోతైన అవగాహనను పెంపొందించుకునేందుకు విద్యార్థులకు తోడ్పడతాయన్నారు. భవిష్యత్‌లోనూ సుప్రసిద్ధ హెచ్‌ఆర్‌ ప్రొఫెషనల్స్‌‌తో మెరుగైన సదస్సులను నిర్వహిస్తామన్నారు.

ఎన్నో రంగాలలో అద్భుతాలను సృష్టించేందుకు ఇది పునాదిగా నిలుస్తుందని కేఎల్‌హెచ్ జీబీఎస్ డైరెక్టర్ డాక్టర్‌ ఎ.రామకృష్ణ అన్నారు. తమ విద్యార్థులకు అత్యుత్తమ, అత్యున్నతమైన పరిశ్రమ అవగాహన కల్పించేందుకు మేనేజ్‌మెంట్, మెంటార్లు చేసిన గొప్ప ప్రయత్నం ఇదని సుజితా రావూరి కొనియాడారు. రావూరికి మానవ వనరుల నిర్వహణపై రెండు దశాబ్దాలకుపైగా అనుభవం ఉంది.

Updated Date - 2022-11-25T19:50:07+05:30 IST