విద్యాలయాల్లో కాషాయీకరణను సహించం
ABN , First Publish Date - 2022-08-31T18:36:38+05:30 IST
విద్యాలయాల్లో(schools) కాషాయీకరణ చేస్తే సహించేది లేదని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ
భగత్‌నగర్, కరీంనగర్, ఆగస్టు 30: విద్యాలయాల్లో(schools) కాషాయీకరణ చేస్తే సహించేది లేదని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ(bjp) రెండవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా విధానాల్లో మార్పుల పేరుతో కాషాయీకరణ చేయాలని చూస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నాయకులు మత విద్వేశాలు సృష్టించడానికి కుటిల ప్రయత్నం చేస్తున్నారన్నారు. విద్యను ప్రైవేటీకరణ చేయడం మూలంగా పేద విద్యార్థులు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. నూతన విద్యా విధానం 2020 పేరుతో యూనివర్సిటీల(Universities)ను ఆదాని, అంబానీలకు కట్టబెట్టాలనే ప్రయత్నం జరుగుతుందన్నారు. కేంద్ర బడ్జెట్‌లో విద్యకు పది శాతం నిధులు కేటాయించాకుండా పటేల్ విగ్రహానికి మూడు వేల కోట్లు కేటాయించి విద్యకు అన్యాయం చేశారన్నారు. రఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికలకు ముందు చెప్పి మాట మార్చిన ఘనుడు మోదీ అన్నారు. నూతన రాష్ట్ర అధ్యక్షులు,రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఎన్నికైన కసిరెడ్డి మణికంఠరెడ్డి, బాలసాని లెనిన్‌లను ఏఐఎస్‌ఎఫ్ జిల్లా నాయకత్వం గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జాతీయ కౌన్సిల్ సభ్యుడు భోనగిరి మహేందర్, జిల్లా అధ్యక్షుడు మచ్చ రమేష్, ఉపాధ్యక్షుడు మామిడిపల్లి హేమంత్ కుమార్ పాల్గొన్నారు.